Friday, May 17, 2024
- Advertisement -

జయలలితకు అంతా తెలిసినా సరే ఏమీ చేయలేకపోయింది..

- Advertisement -
jayalalitha could not do anything even she knows everything..

చెన్నై: రాజకీయాల్లో పైకి రావాలంటే కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఒక మార్గం. ఇంకోదారిలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ మోసాలు చేసుకుంటూ పైకి మాత్రం మంచిగా కనిపిస్తూ ఆక్రమణ చేయడం. ఇక్కడ తమిళనాడు దివంగత సీఎం జయలలిత మొదటి మార్గం ద్వారా పైకొచ్చారు. అయితే

చాలా సార్లు రెండో మార్గం ద్వారా పైకొచ్చిన వారే మనకు ఎక్కువగా కనిపిస్తారు. తాజాగా అమ్మ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందనేది ప్రస్తుత హాట్ టాపిక్. 

 

ఒక ఆయాగా పనిచేసింది, వీడియో రికార్డింగ్ షాపు నడిపింది. అలాంటిది జయతో ఏ రక్త సంబంధం లేకపోయినప్పటికీ ఆమె సమాధి కార్యక్రమాలన్నింటిని తానే నిర్వహించే వరకు వచ్చింది శశికళ. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠమెక్కే స్థితికి చేరుకుంది. అందుకు ఆమె మంచితనమే కారణమైతే ఓకె. కానీ జయలలితనే అణిచివేసిన స్థితి అయితే మాత్రం సమ్మతం కాదు. అమ్మకు అత్యంత ఆప్తమిత్రురాలిగా ఎలా మారిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ప్రముఖ రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయితే శశికళ వల్ల జయలలిత పతనమయ్యారని ఒకింత ఘటుగానే స్పందించారు. గుజరాత్ ఒక దశలో శశికళ జరిపుతున్న మోసపూరిత తంతును గుర్తించి దిద్దుబాటు చర్యలను జయ చేపట్టిందనేది ఓ వాదన. 

 

జయలలిత ఉండే ప్రత్యేకమైన పోయెస్ గార్డెన్‌లో కొన్ని రహస్య స్థలాల్లో కెమేరాలు పెట్టి వీడియోలను సైతం శశికళ చిత్రించినట్టు పుకార్లు ఉన్నాయి. బహుశా ఇలాంటి చర్యల వల్లనే తనను మోసం చేస్తుందని తెలిసినా సరే జయలలిత తప్పక శశికళకు తలవంచిందని మరో పుకారు. అయితే ఇరువురికి మధ్య ఓ ప్రత్యేక అనుబంధముందని గుసగుసలాడుకునేవారు కూడా లేకపోలేదు. ఏదీ ఏమైనప్పటికీ జయలలిత సీఎంగా ఉన్న సమయంలోనే తన వర్గాన్ని, బలగాన్ని పెంచుకున్న శశికళ త్వరలో ప్రస్తుత తమిళ సీఎం పన్నీరు సెల్వాన్ని పక్కన పెట్టి తానే ముఖ్యమంత్రిగా మరే రోజు దగ్గర్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే జయలలిత నియోకవర్గమైన ఆర్కెనగర్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యిందట చిన్నమ్మ శశికళ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -