Monday, May 6, 2024
- Advertisement -

అమెరికాలో ఉద్యోగాల గోల.. కనిపిస్తే ఏరివేత..!

- Advertisement -

అమెరికా ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి క్యాపిటల్​ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి ప్రస్తుతం ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. అమెరికాలోని వివిధ కంపెనీలు.. ఆ నిరసనకారులను గుర్తించి ఉద్యోగాల్లో నుంచి ఉద్వాసన పలుకుతున్నాయి.మేరీలాండ్​లోని ఓ ప్రచురణ సంస్థ.. తమ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి క్యాపిటల్​ భవనం వద్ద బుధవారం సంస్థ గుర్తింపు కార్డు ధరించి తిరుగుతున్న ఫొటోలను చూసింది. అనంతరం ఆ మరుసటి రోజు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. క్యాపిటల్​పై దాడిలో పాల్గొన్న చాలా మందికి ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.

సామాజిక మాధ్యమాల్లోని ఫొటోల్లో తమ కంపెనీ ఉద్యోగస్థులెవరైనా ఉన్నట్లు తేలితే.. వారి ఉద్యోగాలను తొలగిస్తున్నారు. ఇతరుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే ప్రమాదకరమైన ప్రవర్తన ఉన్న వ్యక్తులకు తమ సంస్థలో ఉపాధి కల్పించలేమని నేవిస్టర్​కు చెందిన ఓ ప్రచురణ సంస్థ పేర్కొంది. నెటిజన్లు కూడా వారిని గుర్తించి ఉద్యోగాల్లో నుంచి తొలగించాలని సదరు కంపెనీలను డిమాండ్​ చేస్తున్నారు.

అయితే ఈ అల్లర్లలో చిరుస్థాయి ఉద్యోగులే కాకుండా.. ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. కాజెన్సియా సంస్థ సీఈఓ బార్డ్​లీ రక్​స్టేల్స్.. అల్లర్లలో పాల్గొన్నందున కంపెనీ యాజమాన్యం అతడిని సెలవులపై ఉంచింది. అతని అభిప్రాయాలతో కంపెనీకి సంబంధం లేదని ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -