Monday, May 13, 2024
- Advertisement -

ట్రిపుల్ త‌లాక్ బిల్లుకు లోక్‌స‌భ ఆమోద‌రం…..

- Advertisement -

ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎట్ట‌కేల‌కు లోక‌స‌భ ఆమోదం తెలిపింది. ఎమ్ఐఎమ్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసి చేసిన ప్ర‌తిపాద‌న‌లు వీగిపోయాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 245, వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటు వేశారు. బిల్లుకు స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న్ ఆమోదం తెలిపారు. ఈ బిల్లును జేపీసీకి పంప‌క పోవ‌డంతో కాంగ్రెస్‌, అన్నాడీఎంకే పార్టీలు స‌భ‌నుంచి వాకౌట్ చేశాయి.

లోక్ స‌భ రెండు సార్లు వాయిదా ప‌డిన త‌ర్వాత కేంద్ర‌న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ట్రిపుల్ త‌లాక్ బిల్లును ప్ర‌వేశ పెట్టారు. అనంత‌రం స్పీక‌ర్ ఓటింగ్‌ను నిర్వ‌హించారు.ట్రిపుల్ తాలాక్ బిల్లుకు అనుకూలంగా 245మంది స‌భ్యులు ఓటు వేశారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని ఈ ఏడాది సెప్టెంబర్ లో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను ఆరు నెలల్లోగా బిల్లు రూపంలో తీసుకురావాల్సిన క్రమంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -