Thursday, April 25, 2024
- Advertisement -

ముస్లీం మహిళలకు షాదీ శగున్ పేరిట 51 వేల కానుక..

- Advertisement -

యుపీలో కలిసొచ్చిన ముస్లీం మహిళల వల ఈసారి కూడా మోడీ కంటిన్యూ చేసేలా ఉన్నాడు. దీనికోసమని మైనార్టీ బాలికల కోసం మరో స్కీం ప్రవేశపెట్టనున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన ముస్లిం అమ్మాయిలకు 51 వేల కానుక ఇస్తూ మోదీజి… మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చేసిన ఈ ప్రతిపాదనను మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా తెలిపింది. షాదీ శగున్ పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

మైనారిటీలలో ఉన్నత చదువులను ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీం ను షురూ చేశారు. బేగమ్ హజ్రత్ మహల్ అంటే మౌలానా ఆజాద్ ఫౌండేషన్ అందించే స్కాలర్ షిప్ కు అర్హత సాధించినవాళ్లంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకు ముందు పన్నెండో తరగతి వరకు ముస్లిం బాలికలకు నెలవారీ స్టైఫండ్లు ఇచ్చేవాళ్లు. అయితే దీనిని డిగ్రీ వరకు పొడిగించాల్సిందిగా కోరుతూ ఓ ప్రతిపాదనను ఈ ఏడాది జులైలో మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వికి పంపించారు. షాదీ శగున్ పథకం డీటైల్స్ ను మౌలానా ఆజాద్ ఫౌండేషన్ తమ అధికారిక వెబ్ సైట్ లో ఉంచనుంది. ప్రస్తుతం బేగమ్ హజ్రత్ మహల్ స్కాలర్ షిప్ కు అదనంగా ఈ షాదీ శగున్ ఇవ్వనున్నారు.

ఆరు మైనారిటీ సామాజిక వర్గాలైన ముస్లిం – క్రిస్టియన్ – సిక్కులు – బౌద్దులు – జైనులు – పార్శీలకు ఈ మెరిట్ స్కాలర్ షిప్ అందిస్తున్నారు. అయితే పేరెంట్స్ సంపాదన ఏడాదికి 2 లక్షలు దాటితే వారికి ఈ స్కాలర్ షిప్ లు ఇవ్వరు. ఆడపిల్లల పెళ్లి కోసం డబ్బు దాచి వాళ్లను చదువులను మధ్యలోనే ఆపేయొద్దనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభించినట్లు మైనారిటీ శాఖ తెలిపింది. రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటికే మహిళా ఓటర్లు బీజేపీకి మద్దతు పలికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -