Saturday, May 18, 2024
- Advertisement -

మోడీ కీ చంద్రబాబు కీ మధ్య నడుస్తున్న పెద్ద యుద్ధం

- Advertisement -
Modi Not Interested on Chandrababu Naidu

పెద్ద నోట్ల రద్దు తో దేశం మొత్తం తలనొప్పితో వేగుతున్న వేళలో ముఖ్యమంత్రులు అందరూ కలిసొచ్చి ప్రజలకి అర్ధం అయ్యేలా పరిస్థితి ని చెప్పాల్సిన తరుణం లో ఏపీ సీఎం చంద్రబాబు సారధ్యం లో ఒక కొత్త ముఖ్యమంత్రుల కమిటీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ కమిటీ కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యం వహిస్తున్నారు.

ఈ విషయం లో మోడీ చాలా సీరియస్ గా ఉన్నారు అని తెలుస్తోంది. తన దృష్టిలో అత్యంత నిజాయతీ పరుడు నితీష్ కుమార్ ని పక్కకి పెట్టి జైట్లీ కావాలనే చంద్రబాబు కి ఇవ్వడం పట్ల మోడీ మొదట సీరియస్ అయ్యారట కానీ అసలు విషయం తెలుసుకుని సైలెంట్ అయినట్టు సమాచారం.జైట్లీ మాత్రం రెండు కారణాలను చూపించి మోడీని ఒప్పించినట్లుగా చెబుతున్నారు.  ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లుగా… నోట్ల రద్దు విషయంలో రెండు నాలుకలతో మాట్లాడుతున్న చంద్రబాబు బండారం బయటపెట్టడానికి గాను ఆయన్నే ఈ కమిటీకి సారథిగా నియమించి ఇరుకునపెట్టాలని జైట్లీ తన వాదన వినిపించారట.  

హుద్ హుద్ తుపాను సమయంలో అంత చేశా ఇంత చేశా అని గొప్పలు చెప్పుకొంటూ… నేనైతే ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని అలా అమలు చేసేవాడిని ఇలా అమలు చేసేవాడిని అంటున్న చంద్రబాబు ఈ కమిటీ నాయకుడిగా ఏం చేస్తారో చూద్దామని… ఆయన సామర్థ్యమేంటో దీంతో బయటపెడదామని జైట్లీ అన్నట్లు టాక్.  ఒకవేళ నిజంగా మంచి సూచనలు చేయగలిగితే అది ఉపయోగపడుతుందని.. అలా కాకుండా చంద్రబాబు కమిటీ విఫలమైతే ఆయన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోతుందన్నది జైట్లీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తుంటే సబ్ కమిటీ సారథ్య బాధ్యత ఇప్పుడు చంద్రబాబుకు కత్తిమీద సామే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -