Wednesday, April 24, 2024
- Advertisement -

మరో 280 చైనా యాప్‌లపై భారత్‌ నిషేదం.. అందులో పబ్‍జీ కూడా..!

- Advertisement -

టిక్‌టాక్‌ సహా 59 చైనా మొబైల్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సరిహద్దుల వద్ద చైనా తీరుకి ప్రతిగా ఆ దేశానికి చెందిన ఈ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు మరికొన్ని యాప్స్ ని బ్యాన్ చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

చైనాకు చెందిన లక్షలాది యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. భారత్ లో ప్రజాదరణ పొందిన మరో 280 చైనా యాప్‌లపై కూడా నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైతున్నట్లు తెలుస్తోంది. చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గుర్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన పబ్‍జీని కూడా బ్యాన్ చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.

280 యాప్‌లపై ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ నిఘా పెట్టినట్లు తెలిసింది. ఈ యాప్స్ ద్వారా డేటా ఎలా మారుతుంది అనే విషయంపై నిపుణులు సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇప్పటికే 59 చైనా యాప్‌ల నిషేధం విధించడంపై చైనా స్పందిస్తూ.. భారత చర్య తమని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

సాక్షిలో సత్తి ఎంత సంపాధిస్తున్నాడో తెలుసా ?

ఏపీ లో కరోనా కలకలం.. ఒక్క రోజులో 6045 కేసులు..!

కరోనా తో కుప్పకూలుతున్న జీవితాలు

చిలుకూరు బాలాజీ దేవాలయం లో అద్భుతం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -