Sunday, May 12, 2024
- Advertisement -

సేవ‌గాణాన్ని చాటుతున్న క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్‌

- Advertisement -

క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట‌యితే ఏంది.. ఉన్న‌త‌మైన క్యార‌క్ట‌ర్ ఉండాలి. ధ‌న‌వంతుల‌కు కాకుండా గుణ‌వంతులకే ఎక్కువ మ‌ర్యాద‌, గౌర‌వం ఉంటాయి. ఆ విధంగా చేయ‌బ‌ట్టే త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు సినీన‌టులంటే అంత పిచ్చి. వారి కోసం ఏ ప‌నైనా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతారు. ప్ర‌జ‌లు ఆప‌ద‌లో ఉంటే వెంట‌నే స్పందించే గుణం వారికి ఉంటుంది. ఆ విధంగా సినిమాల్లో వివిధ పాత్ర‌లు పోషిస్తూ న‌టించిన ర‌మ్య‌శ్రీ త‌న సేవ‌గుణాన్ని చాటుతోంది. తన పేరు మీద రమ్య హృదయాలయ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో వృద్ధులు, అనాథ‌లు, యాచ‌కుల‌కు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తోంది. తాను సినిమా ప‌రంగా సంపాదించిన డ‌బ్బును ఈ విధంగా సేవా కార్య‌క్ర‌మాలకు వినియోగిస్తోంది.

వృద్ధులు, పిల్ల‌ల‌పై అమిత ప్రేమ‌ త‌న సేవ‌ల‌ను కొన‌సాగిస్తూ ఆద‌ర్శంగా ర‌మ్య‌శ్రీ నిలుస్తున్నారు. ఆమె ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆల‌నాపాల‌నా చూస్తున్నారు. ఆరుగురు వృద్ధుల బాగోగుల‌పై దృష్టి పెట్టారు. పిల్లల్లో ఒకరు ఆరో తరగతి, మరొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ప్రయోజకులయ్యే వరకు తన బాధ్యత అని వారికి ఆమె భ‌రోసా క‌ల్పిస్తున్నారు. త‌నలాగ సేవ చేయాల‌నుకునే మ‌న‌స్త‌త్వం గ‌ల వారిని ఆమె ఆహ్వానిస్తోంది. ఫేస్‌బుక్‌లో రమ్య హృదయాలయ ఫౌండేషన్ ఓపెన్ చేశారు. స‌హాయం కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేవారు, స‌హాయం చేయాల‌నుకునే వారికి ఆమె త‌న వివరాలు అందులో వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే ఆమె ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. పెద్ద న‌టీన‌టుల చేయ‌లేన‌న్ని కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్ట‌ణం త‌దిత‌ర ప్రాంతాల్లో ఆమె ఇదివ‌ర‌కు ప‌లు కార్య‌క్ర‌మాలు చేశారు. మీరు మ‌ద్ద‌తు ప‌ల‌కండి.. అన్నార్తుల ఆక‌లి, బాధ‌లు తీరడంతో మ‌నమూ భాగ‌స్వాముల‌వుదాం.

ర‌మ్య‌శ్రీ పేరు తెలియ‌ని ప్రేక్ష‌కుడు ఉండ‌రు. ఆమె చాలా సినిమాల్లో న‌టించి మెప్పించారు. ఇటీవ‌ల ఓ మ‌ల్లీ సినిమా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించారు. ఆమె సేవలను గుర్తించిన హెల్త్‌కేర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఇటీవల ‘మదర్‌ థెరిస్సా’ అవార్డు ర‌మ్య‌శ్రీకి ప్రదానం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -