Wednesday, May 15, 2024
- Advertisement -

త‌న దారి త‌ను చూసుకంటున్న విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని….? భాజాపాలోకా…జ‌న‌సేన‌లోకా…?

- Advertisement -
MP Kesineni Nani Vs CM Chandrababu Naidu

విజ‌మ‌వాడ టీడీపీలో రాజ‌కీయ ముస‌లం ప్రారంభ‌మ‌య్యింది.ఎంపి కేశినేని నాని వ్య‌వ‌హారంపై పార్టీలో పెద్దెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.గ‌త కొంత‌కాలంగా నాని పార్టీపై దిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు.

ప‌దేప‌దే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌య్యాయి.ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రికి…నానికి మ‌ధ్య అధిప‌త్య‌పోరు కొన‌సాగుతోంది.

{loadmodule mod_custom,GA1}

ఇప్ప‌టికే కాంగ్రెస్ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి టీడీపీలోకి వ‌స్తున్నార‌న్న వార్త‌లు నానికి మింగుడు ప‌డ‌టంలేదు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాని స్తానంలో వేరేవారిని ఎంపీగా పోటీ చేయాల‌ని స‌ద‌రు కీల‌క‌నేత భావిస్తున్నారు.దీనిక బాబు స‌పోర్ట్‌కూడా ఉంద‌ట‌.ఈమ‌ధ్య‌న బాబు-నాని మ‌ధ్య దూరం పెరుతోంది.అదే సమయంలో విజయవాడ రాజధాని ప్రాంతమైపోవటంతో ఇక్కడి నుండి పోటి చేయటానికి పార్టీలోని నేతలతో పాటు బయట వ్యక్తుల నుండి కూడా చంద్రబాబునాయుడుపై బాగా ఒత్తిడి మొదలైందట.
జరుగుతున్న విషయాలను గమనిస్తున్న నాని తనదారి తాను చూసుకోవాలన్న నిర్ణయానికి నాని కూడా వచ్చారట. అందులో భాగంగానే ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. మొదటి నుండి కూడా కేశినేని-చంద్రబాబు మధ్య అంత సయోధ్య అయితే లేదన్నది పార్టీ నేతల మాట. పోయిన ఎన్నికల్లో విజయవాడలో పోటీ చేసే అవకాశం ఇవ్వటమే చంద్రబాబుకు ఇష్టం లేదట. అయితే, అప్పటి పరిస్ధితుల కారణంగా నానికి టిక్కెట్టు ఇవ్వక తప్పలేదు. దానికితోడు నాని మొదటి నుండి భాజపాకు దగ్గరగా ఉంటున్నారన్న ప్రచారం కూడా పార్టీలోనే జరుగుతోంది.

{loadmodule mod_custom,GA2}

ఏపీలో పాగా వేయాల‌నుకుంటున్న భాజాపాకి నానిల్లాంటి వాల్ల అవ‌స‌రం ఎంతైనా ఉంది.మ‌రోవైపు జ‌న‌సేన నాయ‌కుల‌తోకూడా ట‌చ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా నానికి చెక్ పెట్టేందుకు ల‌గ‌డ‌పాటిని పార్టీలోకి చేర్చుకుంటున్నార‌న‌డంలో సందేహంలేదు.ఇప్ప‌టి నుంచి త‌న దారిని తాను చూసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}GP6QFkv9TgI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -