Saturday, May 18, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు ముద్ర‌గ‌డ డెడ్ లైన్

- Advertisement -
mudragada padmanabham dead line cm chandrababu naidu

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి కాలం క‌ల‌సిరావ‌ట్లేదు. నిన్న‌టి దాకా మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్తీక‌ర‌న‌, కొత్త ఇళ్లు వీట‌న్నింటినుంచి బ‌య‌ట ప‌డ‌క ముందే మ‌రో స‌మ‌స్య బాబును వెంటాడుతోంది. గ‌తంలో కాపు ఉద్య‌మం చంద్ర‌బాబుకు ఏవిధంగా చుక్క‌లు చూపించి కంటిమీద కునుకులేకుండా చేసిందో అదే అంశం ఇప్పుడు మ‌ళ్లీ నిద్ర‌లేకుండా చేస్తోంది. కాపు రిజ‌ర్వేష‌న్‌ల‌పై ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డంప‌పై  మ‌రోసారి ఉద్య‌మానికి సిద్ద‌మ‌వుతున్నాడు.  రిజర్వేషన్ అంశంపై ఇప్పటికే ఓ దఫా ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చారు.

మే 7వ తేదీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన ఆయన.. ఆలోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మే 7వ తేదీన సీఎం చంద్రబాబు నుంచి  కాపు రిజ‌ర్వేష‌న్‌ల‌పై సానుకూల స్పంద‌న రాకుంటే  .. అదే రోజు కాపు జేఏసీ నేతలతో స‌మావేశంకానున్నారు. స‌మావేశంలో ఉద్య‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌రన ప్ర‌క‌టిస్తామ‌న్నారు. ఒకవేళ కాపు రిజర్వేషన్లపై సీఎం నుంచి చర్చలకు ఆహ్వానం లభిస్తే… తమ తరుపున ఐదుగురిని చర్చలకు పంపుతామని అన్నారు..

చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని అంత‌టినీ ఉప‌యేగించి  మరీ చంద్రబాబు ఉద్యమాన్ని అణచివేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు.మాలోనే మాకు చిచ్చు రాజేస్తున్నార‌నీ మండిప‌డ్డారు.  ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో కాపు సోదరులంతా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. అదే సమయంలో ఇటీవల సుప్రీం కోర్టు చేసిన ప్రకటనను ముద్రగడ గుర్తుచేశారు. మ‌రి ముద్ర‌గ‌డ డెడ్‌లైన్‌పై చంద్ర‌బాబు ఏ విధంగా స్పందిస్తారో అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఒక వేల నిర్ణ‌యంతీసుకోకుంటే  బాబుకు మరోత‌ల‌నొప్పి త‌ప్ప‌దు.

Related

  1. వైకాపా ఎమ్మెల్యే లకి చంద్రబాబు ఓపెన్ ఆఫర్ 
  2. అమజాన్ ఇస్తున్న బంపర్ ఆఫర్ లు చూడండి
  3. బోయపాటికి బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు!?
  4. చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌ద‌రంగంలో అఖిల ప్రియ పావేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -