Saturday, May 18, 2024
- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీ అంతరిక్ష దౌత్య చాకచక్యానికి నిదర్శనమే జీశాట్ -9 ఉప‌గ్ర‌హం

- Advertisement -
Narendra Modi tight slap to Pakistan SAARC satellite without Pakistan

న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఇత‌ర దేశాల‌తో దౌత్య సంబందాల‌పై దృష్టి సారించారు. పాకిస్థాన్ మిన‌హా ఇత‌ర సాక్క్ దేశాల‌కు టెలీక‌మ్యూనికేష‌న్ సేవ‌లు అందించేందుకు భార‌త్ జీశాట్‌-9 ఉప‌గ్ర‌హాన్ని విజ‌య‌వంతంగా ప్ర‌యేగించింది.

ప్రధాని నరేంద్రమోదీ అంతరిక్ష దౌత్య చాకచక్యానికి నిదర్శనమే జీశాట్ -9 ఉప‌గ్ర‌హం. ద‌క్షిణాసియా దేశాల‌కు మోదీ అందించిన కానుక‌. పాక్ మినహా సార్క్ దేశాలకు కమ్యూనికేషన్ సేవలందించే జీశాట్-9 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావ‌డంతో భారత్, దక్షిణాసియా దేశాలు సగర్వంగా తలెత్తుకున్నాయి.అదే సమయంలో పాకిస్థాన్ సిగ్గుతో తల దించుకుంది.
మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే స‌మ‌యంలో సార్క్ దేశాల‌కు ఉమ్మ‌డిగా ఉప‌యేగ ప‌డే శాటిలైట్‌ను త‌యారు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.అయితే మొద‌టినుంచి భార‌త్‌పై ప‌గ‌ను పెంచుకున్న పాకిస్థాన్ ఈప్రాజెక్టును నాశ‌నం చేయ‌డానికి ఎన్ని పావులు క‌దిపినా అవేవి ప‌లించ‌లేదు.పొరుగు దేశాలతో భారత్ దౌత్య బంధాలను టెక్నాలజీ విషయంలోనూ బలపరుచుకుంటోంది…. కానీ.. చైనాను పట్టుకుని వేలాడిన పాకిస్తాన్.. పాతాళానికి పడిపోతోంది.
దక్షిణాసియా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంతో భారత్ భాగస్వామ్యానికి కొత్త ద్వారాలు తెరుచుకున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఉపగ్రహం దక్షిణాసియాకు ఎంతో లబ్ధి చేకూర్చి, ప్రాంతీయ ప్రగతికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భూటాన్ ప్రధాని త్సేరింగ్ తోబ్‌ గయ్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్, ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ భారత్ అందించిన టెక్నాలజీ గిఫ్ట్‌ని సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.
అయితే కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్థాన్ మాత్రం ఇదంతా భారత్ కావాలని చేసిందంటూ విషం కక్కుతోంది. భారత్‌ తోపాటుగా సార్క్ దేశాలైన శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్, బాంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు తమ కమ్యూనికేషన్ అవసరాలకు జీశాట్-9 సేవలను వినియోగించుకుంటాయి. పాకిస్థాన్ మాత్రం మొదటి నుంచి తనకు సొంతంగా అంతరిక్ష కార్యక్రమం ఉందంటూ వైదొలిగింది. నిజానికి మొత్తంగా ఉపగ్రహ ప్రయోగాన్నే డోలాయమానంలో పడేసే ఉద్దేశంతో పాక్ పావులు కదిపినా అవేవీ పనిచేయలేదు. పాక్ ఏకాకిగా మారింది.
మొదట్లో సార్క్ ఉపగ్రహం అని పేరు పెట్టినప్పటికీ పాక్ తప్పుకోవడం వల్ల దక్షిణాసియా ఉపగ్రహం అని పేరుపెట్టారు. దీనిలోని కేయూ బ్యాండ్ దక్షిణాసియా దేశాలన్నిటికీ అందుబాటులో ఉంటుంది. పాక్ ను ఏకాకిని చేసే దిశగా గగనతలంలో మోడీ వేసిన స్మార్ట్ స్కెచ్ తో ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. ఉగ్రవాదులకు పాలు పోసి పోషించే పాక్ తో ఎప్పటికైనా ముప్పేనని ప్రధాని మోడీ ముందే ఊహించారు. అందులో భాగంగానే ఈ ఉపగ్రహ ప్రయోగం విషయంలోనూ పాక్ పక్కకు జరగడం మన దేశానికి కలిసొచ్చింది. ఇటు టెక్నాలజీ విషయంలోనూ పాక్ ను కట్టడి చేసి విజయం సాధించారు మోడీ.

Related

  1. నింగిలోకి దూసుకెల్లిన‌.. సార్క్ ఉప‌గ్ర‌హం
  2. పాక్ ప్ర‌ధాని న‌వాజ్‌పై కేసు న‌మోదు….
  3. పాక్‌పై మండిప‌డ్డ‌ ఉత్త‌ర కొరియా….
  4. జీశాట్ -9 ఉప‌గ్ర‌హం…..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -