Thursday, May 2, 2024
- Advertisement -

చలసాని మాట.. నమ్మేద్దామంటారా!!

- Advertisement -

అసలుకే దిక్కు లేదు.. ఇంక అంతమొత్తం ఒకేసారి ఇస్తామని చెబితే ఎలా నమ్మేయాలని అని ఆంధ్రా జనాలంటున్నారు. విభజన జరిగినప్పటి నుంచి.. రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఒకేసారి 70 వేల కోట్లు ఇస్తామంటే.. నమ్మేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు.. మేధావి చలసాని శ్రీనివాస్ చెప్పిన మాటలు కారణమవుతున్నాయి. రాష్ట్రానికి అన్ని సహాయాల పేరుతో.. ఒకేసారి 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ అనౌన్స్ చేసి.. కేంద్రం చేతులు దులిపేద్దామనుకుంటోందని.. రీసెంట్ గా.. చలసాని ఓ మాట చెప్పారు.

విభజన జరిగి రెండేళ్లు పూర్తి అయినా.. ఇప్పటికి విశాఖకు రైల్వే జోన్ లేదు.. ప్రత్యేక హోదా లేదు. రాజధాని సహాయం లేదు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధుల ఊసే లేదు. ఇవన్నీ కాకుండా.. ఒకేసారి 70 వేల కోట్లు ఇస్తామంటే.. నమ్మేదెలా అని ఏపీ ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ విషయాలపై.. చలసాని క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

టీడీపీ నేతలు చెప్పలేదు.. బీజేపీ నేతలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాంటిది.. ఈ విషయం చలసానికి ఎలా తెలిసిందో చెప్పాలని నిలదీస్తున్నారు. 70 వేల కోట్లను కేంద్రం ఇస్తోందంటూ.. తమను మాయలో పడేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక్క రాజధానిపైనే దృష్టి పెడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని చాలా మంది ఆందోళనలో ఉన్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో.. మరింత గందరగోళానికి గురి చేయొద్దని రాజకీయ పరిశీలకులు కూడా చలసాని లాంటి మేధావులకు సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -