- Advertisement -
సహారా పరివార్ చీఫ్ సుబ్రతో రాయ్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఆర్దిక నేరాల కేసులో జైలులో ఉన్న సుబ్రతో రాయ్ ఇటీవలే పెరోల్ పై విడుదలయ్యారు. హైదరాబాద్ లో ఉన్న స్టాక్ హోల్డర్ లతో ఆయన సమావేశం కానున్నారు.
సుబ్రతో రాయ్ తల్లి చబ్బిరాయ్ మరణించిడంతో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. హైదారాబాద్ వస్తున్న సుబ్రతో రాయ్ ఇక్కడ దాదాపు నాలుగు వేల మంది ఉద్యోగులు, కస్టమర్లు, వాటాదారులను కలుసుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం అంతా ప్రయివేట్ గా జరుగుతోంది. దీంతో సుబ్రతో రాయ్ స్ధానిక మీడియాతో మాట్లాడే అవకాశం లేదు.
