Thursday, April 25, 2024
- Advertisement -

లిక్కర్ బ్యాన్ తో పని అయిపోదు, ఇంకా చాలా ఉంది నితీష్ గారూ ..

- Advertisement -

బీహార్ కి మూడవ సారి ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ కి ప్రజలు మొట్ట మొదటి పరీక్ష పెట్టబోతున్నారు. ఈ పరీక్ష ఒక రకంగా తనకి తానే పెట్టుకున్నారు అని చెప్పాలి. ఇలాంటి వ్యక్తిత్వం ఆయనకీ కొత్తేమీ కాదు కానీ దాని వల్లనే ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారు అనిపిస్తోంది. 

బీహార్ లో మళ్ళీ అధికారం రాగానే మద్యపానం నిషేధం విధిస్తాం అని చెప్పారు ఆయన ఇది సంచలన నిర్ణయం అని చెప్పాల్సిందే. ఎందుకంటే దాదాపు నలుగు వేల కోట్ల మేర ఖజానా కి ఈ నిర్ణయం వల్ల గండి పడుతుంది. బీహార్ అసంబ్లీ లో మహిళా ఓటర్లు ఈ కారణం వల్లనే  జేడీయూ కి పట్టం కట్టారు.  

బంపర్ మెజార్టీతో బీహార్ పీఠం కైవసం చేసుకున్న నితీశ్ కుమార్ ఎన్నికల హామీని అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. రాబోయే ఏప్రిల్ లో ఈ నిర్ణయం అమలుకి రాబోతోంది అని చెప్పారు నితీష్.

మద్యపానం ఆపేస్తే దొంగదారుల్లో అమ్మే అవకాశం కూడా ఉంది అని స్వయంగా ఆయనే అన్నారు అంటే బీహార్ లో పరిస్థితి అర్ధం చేసుకోవాలి. ఆర్ధికంగా పెను భారాన్ని మొయ్యాలి ప్రభుత్వం. బీహార్ లో మద్యపానాన్ని ఆపాలి అని ఎప్పటి నుంచో మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి కూడా.

విచ్చల విడిగా లభించే మద్యం అక్కడ బతుకులు చిన్నా భిన్నం చేసింది. పల్లెల్లో గుడుంబా తయారు చెయ్యడం మామూలు విషయం అయిపొయింది. ఇలాంటి పరిస్థితి లో మద్యం బ్యాన్ తో పాటు దొంగ మద్యం కూడా రాకుండా అరికట్టడం నితీష్ ముందర ఉన్న సవాల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -