Friday, May 3, 2024
- Advertisement -

ఉరి తీసె ప్రాంతాల‌ను తెలుసుకోవాల‌ని ఉందా…?

- Advertisement -

ప్ర‌పంచంలో ప్ర‌జాస్వామ్య దేశాల‌తో పాటు నియంత పాల‌న దేశాలు చాలా ఉన్నాయి.అక్క‌డ అధ్య‌క్ష‌డు ఏ నిర్న‌యం తీసుకున్నా అది అమ‌ల‌వ్వాల్సిందే.అలాంటి దేశాల‌ల్లో త‌ప్పులు చేస్తె శిక్ష‌లు భ‌యంక‌రంగా ఉంటాయి.మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న య‌ధేచ్చ‌గా జ‌రుగుతోంది.ఆదేశంలో మాత్రం శిక్ష‌లు ఎలాఉంటాయో తెలిస్తే న‌ర‌న‌రాల్లో భ‌యం పుడుతుంది.
ఉత్త‌ర‌కొరియా గురించి చెప్పాల్సిన అవ‌స‌రంలేదు.అక్క‌డ త‌ప్పులు చేస్తె బ‌హిరంగంగా ఉరిశిక్ష‌లు విధిస్తారు.ఉరిశిక్ష విధించే ప్రాంతాలు తెలిస్తె మీరు షాక్ అవ్వాల్సిందే.నది పరివాహక ప్రాంతాలు, పాఠశాలల క్రీడా ప్రాంగణాలు, మార్కెట్లు. ఒకదానికి మరొదానికి సంబంధం లేకుండా ఉన్నాయి అనుకుంటున్నారా?. ఇవన్నీ ఉత్తరకొరియా బహిరంగంగా ఉరి తీయడానికి వినియోగించే ప్రదేశాలు. అక్కడి పాఠశాలల్లో విద్యార్థులు ఉరి తీయడాన్ని ప్రత్యక్షంగా చూస్తారు
ప్ర‌ధానంగా వ్యభిచారులను, పరిశ్రమల నుంచి వస్తువులు దొంగిలించినవారిని, దక్షిణ కొరియాకు దేశ సమాచారాన్ని చేరవేసిన వారిని బహిరంగంగా ఉరి తీస్తారు. దీన్ని ఆ ప్రాంతంలోని ప్రజలందరూ చూస్తారని దక్షిణ కొరియాకు చెందిన ఓ సంస్ధ తన రిపోర్టులో పేర్కొంది. ఉత్తరకొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న 375 మంది ఈ విషయాన్ని చెప్పారని సదరు సంస్ధ వెల్లడించింది.
2014లో నియంతగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హక్కుల ఉల్లంఘన మరింత పెరిగిందని యూనైటెడ్‌ నేషన్స్‌ కమిషన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. భారీ జైళ్లు, క్రమపద్దతిలో హింస, ఆకలితో మాడ్చి చంపడం, ఉరి తీయడం లాంటి శిక్షలు నాజీ కాలం కన్నా ఘోరంగా ఉత్తరకొరియాలో అమలు జరుగుతున్నాయని సంస్ధ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -