Saturday, May 4, 2024
- Advertisement -

మ‌రోసారి క్షిప‌ణి ప‌రీక్ష నిర్వ‌హించిన‌ ఉత్త‌ర కొరియా…

- Advertisement -

ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికా, జ‌పాన్‌ల‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. ఐక్య‌రాజ్య‌స‌మితి, అమెరికా ఆంక్ష‌లు లెక్క చేయ‌కుండా వ‌రుస క్షిప‌ణి ప్ర‌యేగాల‌తో రెండు దేశాల‌కు ముచ్చెమ‌టలు ప‌ట్టిస్తున్నాడు. గతానికి భిన్నంగా ఈసారి వ్యవహరిస్తూ చేపట్టిన క్షిపణి ప్రయోగం జపనీయులకు షాకింగ్ గా మారింది.

మూడు క్షిపణి ప్రయోగాలు ఫెయిల్ అయి 72గంటలు కూడా గడవకముందే కిమ్ తాజాగా మ‌రోసారి మంగళవారం చేసిన క్షిపణి ప్రయోగం అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలను ఆందోళనల్లోకి నెట్టేసింది. జపాన్‌ ద్వీపమైన హోక్కాయ్‌ మీదుగా ప్రయాణించిన క్షిపణి పసిఫిక్‌ సముద్ర జలాల్లో మూడు భాగాలుగా విడిపోయి పడింది. దీంతో రెండు దేశాలు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. ప్రయోగానికి జపాన్‌ వణికిపోయింది. దేశం మీదకు క్షిపణి వస్తోందని ప్రజలంతా ఇళ్లలోకి వెళ్లిపోవాలని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది

ఈ క్షిప‌ణి ప్ర‌యేగంపై జ‌పాన్ తీవ్రంగా స్పందించింది. ఈప్ర‌యేగాలు మా దేశానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తున్నామ‌ని ప్ర‌ధాని షింజో అబే తెలిపారు. ఉత్త‌ర కొరియాపై మ‌రిన్ని ఆంక్ష‌లు తీసుకొనేందుకు వెంట‌నే ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండ‌లి స‌మావేశంను ఏర్పాటు చేయాల‌న్నారు.

మ‌రో వైపు ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న సరిహద్దులో బాంబుల వర్షం కురిపించి తమ శక్తి సామర్ధ్యాలను కిమ్‌ తెలియజేయాలని దక్షిణ కొరియా భావిస్తోంది. ఇందుకు ప్రణాళికను సిద్ధం చేశామని మంగళవారం బాంబు వేస్తామని దక్షిణ కొరియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌నె ఆందోళ‌న అంత‌ర్జాతీయంగా వ్య‌క్త‌మ‌వుతోంది. భ‌విష్య‌త్ ప‌రిస్థితులు ఎలా ఉంటాయొ చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -