Saturday, May 4, 2024
- Advertisement -

రాజధాని ప్యాంగ్యాంగ్ కు క్షిపణులు తరలిస్తున్న ఉత్తరకొరియా…

- Advertisement -

అమెరికా, ఉత్త‌ర కొరియా మ‌ధ్య‌నున్న వైరం తెలిసిందె. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల స్థాయిని దాటి యుద్ధం దిశ‌గా ప‌య‌నిస్తున్నాయి. తాజాగా రెండు దేశాల మ‌ధ్య వైరంతో ఇప్పుడు ప్ర‌పంచం యుద్ధం అంచుల‌కు వెల్లింద‌నె చెప్ప‌వ‌చ్చు. నిన్న‌టి వ‌ర‌కు మాట‌ల‌కే ప‌రిమిత మ‌యిన రెండు దేశాధినేత‌లు ఇప్పుడు ప్ర‌పంచాన్ని వినాశ‌నం వైపున‌కు తీసుకెల్తున్నారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అలానె ఉన్నాయి.

తమను బాగా రెచ్చగొడుతున్న అమెరికాకు ఊహించని షాక్ ఇస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే మరో పరిణామం చోటు చేసుకుంది. రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌కు క్షిపణులను తరలించటం ఆందోళన కలిగిస్తోంది. శాటిలైట్‌ వీక్షణలో ఈ విషయం వెలుగు చూడటం విశేషం. ఈ నేపథ్యంలో అదను చూసుకుని కిమ్‌ సైన్యాలు అమెరికాపై విరుచుకుపడే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.

దీనికి ప్ర‌ధాన కార‌నం ద‌క్షిణకొరియాతో సంయుక్తంగా అమెరికా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తుండ‌ట‌మే కార‌నం. అమెరికాకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తీవ్రహెచ్చరికలు జారీ చేశారు. కొరియన్ ద్వీపకల్ప ప్రాంతంలో దక్షిణకొరియాతో నిత్యం ఏదోఒక డ్రిల్‌తో అమెరికా తమను రెచ్చగొడుతోందని, ఉత్తరకొరియా పట్ల ఉన్మాదంగా వ్యవహరిస్తోందని కిమ్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుత నావీ డ్రిల్స్ ముగిసిన వెంటనే దక్షిణకొరియాతో మరో డ్రిల్‌ను అమెరికా నిర్వహించనుంది. యుద్ధ సమయాల్లో ప్రజలను ఖాళ్లీ చేయించడమే ఈ డ్రిల్ ఉద్దేశ్యం. ప్రతి రెండు సంవత్సరాలకూ ఈ డ్రిల్‌ను నిర్వహిస్తున్నప్పటికీ ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో నిర్వహించడంపై ఉత్తరకొరియా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల నడుమ ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇద్ద‌రి నేత‌లు క‌ల‌సి ప్ర‌పంచాన్ని యుద్ధం దిశ‌గా తీసుకెల్తున్నార‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -