Saturday, May 4, 2024
- Advertisement -

అంత‌ర్జాతీయంగా మొద‌లైన హై టెన్స‌న్‌….

- Advertisement -

ఇద్ద‌రు మూర్ఖుల నిర్ణ‌యాల వ‌ల్ల అంత‌ర్జాతీయంగా యుద్ధ వాతా వ‌ర‌ణం నెల‌కొంది. ఆ ఇద్ద‌రు మూర్ఖులు ఎవ‌రో కాదు. ఒక‌రు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌… మ‌రొక‌రు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌. ఇద్ద‌రి దేశాల మ‌ధ్య గ‌త రెండు,మూడు నెల‌లుగా మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఐక్య‌రాజ్య‌స‌మితి ఆంక్ష‌ల‌ను లెక్క‌చేయ‌కుండా ఉత్త‌ర‌కొరియా అణుప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. తాజా ప‌రిస్థితుల‌ను చూస్తె ఇరు దేశాలు యుద్ధానికి స‌ర్వం సిద్ద‌మ‌నె సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

వ‌చ్చే నెల 9న ఉత్త‌ర‌కొరియా రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని మ‌రో సారి బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్‌ లు నిర్వహించేందుకు సిద్ధమవుతోందని దక్షిణకొరియా నిఘా సంస్థ యోన్హాప్ ప్రకటించింది. దీంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు ఉత్తరకొరియా సర్వం సిద్ధం చేసుకుందని దక్షిణ కొరియా నిఘా సంస్థ యోన్హాప్ వెల్లడించింది.

అయితే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. మ‌రో వైపు జ‌పాన్ కూడా యుధ్ద‌విన్యాసాల‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో యుద్ధానికి సర్వం సిద్ధమా? అన్న అనుమానాలు రేగుతున్నాయి. ఒక వేల ఉత్త‌ర కొరియా అణుప‌రీక్ష‌కు నిర్వ‌హిస్తె ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారుతాయ‌ని అంత‌ర్జాతీయంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -