Saturday, May 4, 2024
- Advertisement -

అమెరికా అంతం ద‌గ్గ‌ర ప‌డింది….

- Advertisement -

అమెరికా-ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. రెండు దేశాలు రెచ్చ‌గొట్టుఉంటూనె ఉన్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లులేవు చేత‌లే ఉండ‌నున్నాయి. తాజాగా ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి.

కిమ్ జాంగ్ ఉన్ అమెరికాకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నానని హెచ్చరికలు జారీ చేశారు. అణుబాంబు ప్రయోగిస్తే ఉత్తరకొరియా సర్వనాశనమవుతుందని అమెరికా రక్షణ ప్రతినిధి ప్రకటించిన వెంటనే కిమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘క్లైమాక్స్’ దగ్గరపడిందని వ్యాఖ్యానించారు. అమెరికా విచారకరమైన వైఫల్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

అదే సమయంలో దక్షిణకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా చెప్పినట్టల్లా దక్షిణకొరియా ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏ క్షణంలో ఏంజరుగుతుందోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంత‌కు ముందు అమెరికా ర‌క్ష‌ణ మంత్రి జేమ్స్ మాటిస్ మాట్లాడుతూ అణుదాడికి దిగితే ఈ మూడు దేశాల్లో శవాల గుట్టలు కనిపించేవని, దాని తీవ్రత ఊహించినంత భయంకరంగా ఉంటుందని తెలిపారు. 30 సెకెన్లకు 30,000 మంది, అరగంటలో 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొన్నారు. అయితే అలా జరగకూడదని అమెరికా భావిస్తున్నది గనుకే అమెరికా ఓపికతో వ్యవహరిస్తుందని తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -