తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్ ను రాజకీయంగా వాడుకొంటున్న తీరు పలు విమర్శలకు కారణం అవుతోంది. ఎన్టీఆర్ నుకూలదోసి ముఖ్యమంత్రి పదవినిసొంతంచేసుకొన్నాడు అనే పేరును కలిగిన..
ఎన్టీఆర్ కు వెన్నుపోటుపొడిచాడు అనేచరిత్రను కలిగిన బాబుఇప్పటికీ ఎన్టీఆర్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడనే పేరును తెచ్చుకొంటున్నాడిప్పుడు. పుష్కరాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజకీయం ఎన్టీఆర్ ను కొత్త వివాదాల్లోకి లాగుతోంది!
పుష్కరాల నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పుష్కరఘాట్ లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అది కూడా శ్రీకృష్ణుడి వేషాధారణలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరి ఒక మానవుడిని ఇలా దైవరూపంలో విగ్రహ ప్రతిష్ట చేయడం విడ్డూరమే. ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్ని సార్లు శ్రీకృష్ణుడి పాత్రను పోషిచినా.. ఇలా విగ్రహం ఏర్పాటుచేయడం విడ్డూరం. అందులోనూ లక్షల మంది యాత్రికులు వచ్చేచోట.. పవిత్రవేడుక జరుగుతున్నచోట ఈ విధంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అనేక విమర్శలకు కారణం అవుతోంది.
ఇలా ఒక మనిషి విగ్రహన్ని దేవుడి రూపంలో ప్రతిష్టింపజేయడం అరిష్టం అని.. అందుకే గోదారమ్మ ఆగ్రహించిందని.. పుష్కరఘాట్ లో..ఎన్టీఆర్ విగ్రహంపక్కనే అంతమంది మరణానికి ఇలాంటి అరిష్టమే కారణం అనే ప్రచారం జరుగుతోంది. దీంతో కొంతమంది సోషల్ సైట్లలో బాబును, ఎన్టీఆర్ నుకూడా కలిపి తిడుతున్నారు. మరి బాబును తిడితే తిట్టారు.. అనవసరం గా బాబు అతిరాజకీయం చేసి.. సామాన్య జనుల చేత చనిపోయిన ఎన్టీఆర్ ను కూడా తిట్టిస్తున్నాడేమో!
