Friday, May 3, 2024
- Advertisement -

తెలంగాణ నుంచి పెద్దల సభకు ఇద్దరు

- Advertisement -

రాజ్యసభ ఎన్నికల నగారా మోగనుంది. ఈ నెల 24న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్ 11 న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున ఫలితాలు కూడా వెలువడతాయి. తెలంగాణలో ఈ సారి రెండు రాజ్యసభ స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన గుండు సుధారాణి, కాంగ్రెస్ పార్టీ నుంచి వి.హనుమంతరావుల రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుంది.

దీంతో తెలంగాణలో ఈ రెండు స్ధానాల భర్తీ కోసం ఎన్నికలు జరుగనున్నాయి. గుండు సుధారాణి ఇప్పటికే తెలుగుదేశం పార్టీని వీడీ టిఆర్ఎస్ లో చేరారు. శాసనసభలో సభ్యలు సంఖ్యను అనుసరించి టిఆర్ఎస్ కు రెండు స్ధానాలు దక్కుతాయి. వీటి కోసం పార్టీలో ముమ్మర పోటీ ఉంది. ఈ రెండు స్థానాలు టిఆర్ఎస్ కు దక్కాలంటే 82 మంది ఎమ్మెల్యేలు కావాలి.

పార్టీ నుంచి గెలిచివారు, పార్టీలో విలీనమైన వారితో కలిసి టిఆర్ఎస్ బలం 81 ఉంది. దీంతో ఈ రెండు స్ధానాలు టిఆర్ఎస్ కే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక టిక్కట్ల రేసులో పార్టీ కోశాధికారి కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, దామోదర్ రావు ముందంజలో ఉన్నారు. వీరిద్దరికి రాజ్యసభలో అవకాశం రావచ్చునని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అభ్యర్ధుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారని కూడా ప్రచారం జరుగుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -