Saturday, May 18, 2024
- Advertisement -

పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు…భారత్, పాక్ మధ్య త్వరలో యుద్ధం స్టార్ట్…

- Advertisement -

భారత్ , పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరో సారి రెండు దేశాల మధ్య యుద్ధం తప్పేటట్టులేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాక్ కాశ్మీర్ కోసం ఎంతవరకైనా వెల్తామని ఆదేశ ప్రధాని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రులు కూడా పదే పదే యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అక్టోబరు తర్వాత భారత్‌తో యుద్ధం జరిగే అవకాశముందని జోస్యం చెప్పారు

అంతకుముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆర్టికల్ 370ని భారత్ చట్టవిరుద్ధంగా తొలగించిందని..కశ్మీరీల హక్కుల కోసం ఎంత వరకైనా వెళ్తామని అన్నారు. అంతేకాదు ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్థ మేఘాలు కమ్ముకున్నాయని..అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఇప్పటికే దౌత్య సంబంధాలను తెంచుకున్న పాక్ తాజాగా ఆ దేశ గగన తలంగుండా భారత్ విమానాలు ప్రయానించకుండా నిషేధం విధించింది.మరి పాక్ వ్యాఖ్యలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -