Saturday, May 18, 2024
- Advertisement -

చంద్రబాబు ఎడమొహం… పవన్ పెడమొహం…

- Advertisement -

వాడుకుని వ‌దిలేయడంలో చంద్ర‌బాబుని మించిన వారు లేర‌నే చెప్పాలి. ఎలెక్ష‌న్స్ టైంలో ఆయ‌న ఏదో ర‌కంగా ఎవ‌రినైన అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావ‌డం బాబు నైజం.2009 ఎలెక్ష‌న్స్ జూ.ఎన్టీఆర్ వాడుకుని అధికారంలోకి రావాల‌ని బాబు ప్ర‌య‌త్నించాడు. వైఎస్ఆర్ ప‌థ‌కాల ముందు ఎన్టీఆర్ ఛ‌రిష్మా ప‌నికి రాలేదు.ఎన్టీఆర్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తే పార్టీ మ‌ళ్లీ నంద‌మూరి వారికి ఎక్క‌డ వెళ్లుతుందో అన్న భ‌యంతో బాబు ఎన్టీఆర్‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరం పెట్టాడు.

2014 ఎలెక్ష‌న్స్‌లో బాబు బీజేపీ,ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చాడు. అధికారంలోకి వ‌చ్చిన నాలుగు సంవ‌త్స‌రాలు దాటిన త‌రువాత అటు బిజేపీని ,ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఇద్ద‌రిని వదిలేశాడు. 2014 బాబు అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌న్ క్రేజ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. మ‌రి అలాంటి ప‌వ‌న్ ఎదురుప‌డితే క‌నీసం మాట వ‌ర‌స‌కైనా బాబు ప‌ల‌కించ‌రించ‌లేదంటే ,అర్థం చేసుకోవాలి బాబు మ‌న‌స్థ‌త్వం ఎలాంటిదో? చాలా కాలం తర్వాత ఎదురుపడిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు కనీసం పలకరించుకోలేదు. పక్క పక్కనే నిలబడ్డా కూడ మాట్లాడుకోలేదు. గుంటూరు జిల్లాలోని నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం నాడు అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -