Saturday, May 4, 2024
- Advertisement -

కేంద్రంపై వైసీపీ, కాంగ్రెస్ పోరుబాట..

- Advertisement -

ఆంధ్రాబ్యాంక్.. ఇన్నాళ్లు ఆంధ్రుల బ్యాంక్ గా ముద్రపడింది. ఆంధ్రుల పేరును జాతీయ స్తాయిలో వినిపించే బ్యాంక్. పైగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ లీడ్ బ్యాంక్ ఇదే.. అలాంటి బ్యాంకును కేంద్రం బ్యాంకింగ్ సంస్కరణల పేరిట యూనియన్ బ్యాంకులో కలపడంపై తెలుగు నాట ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రాబ్యాంక్ కు దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. దాని చరిత్రను, ప్రాశస్త్యాన్ని కాపాడాలని వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ఉమ్మడిగా గళాన్ని వినిపించేందుకు రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చింది.

తాజాగా వైసీపీ ఏపీ ప్రభుత్వం తరుఫున ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఆంధ్రాబ్యాంకును కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని లేఖలో పేర్కొంది. వైసీపీ ఎంపీ బాలశౌరి కూడా కేంద్రం వీలనం చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు బ్యాంకింగ్ సెక్రెటరీని కలుస్తామని ఆయన చెప్పారు.

ఇక వైసీపీకి మద్దతుగా తాజాగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు కూడా కేంద్రానికి ఆంధ్రాబ్యాంకును విలీనం చేయవద్దంటూ లేఖ రాశాడు.

అయితే మెరుగైన లాభాలతో మంచి వ్యాపారంతో సాగుతున్న ఆంధ్రబ్యాంకును విలీనం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల పేరుతో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్ లను కొనసాగించి కేవలం ఆంధ్రా పేరుతో ఉన్న ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడం వివక్ష అని అందరూ కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -