- Advertisement -

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలోకి ఓజా!

- Advertisement -

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల మరియు మహిళల సెలక్షన్ కమిటీల్లో కొత్త సభ్యుల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని పురుషుల కమిటీలో ఇద్దరు, మహిళల కమిటీలో నలుగురు సభ్యులను నియమించనుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 10గా నిర్ణయించింది.

ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న ఎస్. శరత్ పదవీ కాలం పూర్తవడంతో, ఆయన స్థానంలో మాజీ అంతర్జాతీయ ఆటగాడు ప్రగ్యాన్ ఓజా రానున్నారని తెలుస్తోంది. అజిత్ అగార్కర్, అజయ్ రాత్రా కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడగించింది.

పురుషుల కమిటీకి అర్హతలను పరిశీలిస్తే.. కనీసం 7 టెస్టులు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడివుండాలి. కనీసం ఐదు సంవత్సరాల క్రితమే క్రికెట్ నుండి రిటైర్ అయి ఉండాలి. బీసీసీఐ కమిటీల్లో ఐదేళ్లకుపైగా సభ్యత్వం వహించకూడదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -