Wednesday, May 1, 2024
- Advertisement -

కరోనా విషాదం.. ఆక్సిజన్ ట్యాంక్ లీకై 22 మంది మృతి!

- Advertisement -

క‌రోనా వేళ పెను విషాదం చోటుచేసుకున్న‌ది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతతో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి మహరాష్ట్రలో కేసులు, మరణాల సంఖ్య తీవ్ర రూపం దాల్చింది. అంతే కాదు మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో నాసిక్‌లో ఆక్సిజన్ లీకై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ నుంచి సిలిండ‌ర్ల‌లో ఆక్సిజ‌న్ నింపుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది.

ఘ‌ట‌నా స్థ‌లం వ‌ద్ద ఉన్న అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. లీక‌వుతున్న ఆక్సిజ‌న్‌ను అదుపు చేసేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆస్పత్రిలో అప్పటికే సుమారు 150 మంది వరకూ కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ అందకపోవడంతో 22 మంది ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. గ్యాస్ చుట్టుముట్టడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు.

అక్కడి సిబ్బందితో అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. కాగా, మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 351 మంది మరణించారు. దీంతోమొత్తం కేసు 38,98,262 కు చేరుకోగా, మరణాల సంఖ్య 60,824కు చేరింది.

క్వీన్​ కంగనాకు కోపం వచ్చింది.. ఎందుకో తెలుసా?

టీడీపీకి లోకేష్ అనే వైరస్ పట్టుకుంది.. వర్మ సంచలన ట్విట్!

ప్రైవేట్ టీచర్లకు నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -