Friday, May 3, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లో జోష్‌..రాహుల్‌తో కొదండరామ్‌ భేటీ

- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ప్రధానంగా పోరు అధికార బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. ఇక ఈ రెండు పార్టీలు పోటా పోటిగా ప్రచారం చేయడమే కాదు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరింత హీట్ పెంచుతున్నారు.

ఇక అధికార బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని నేతలకు కాంగ్రెస్ సేఫ్ జోన్‌గా మారింది. ఇవాళ నిజామాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆర్మూర్‌లో బీఆర్ఎస్‌లో చేరనున్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌. ఓ వైపు చేరికలు మరోవైపు పొత్తులు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇప్పటికే వామపక్షాలతో పొత్తు దాదాపు ఖరారు కాగా తాజాగా కరీంనగర్‌లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కొదండరామ్‌…రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య భేటీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యం కల్పిస్తామని కొదండరాంతో రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది.పొత్తులో భాగంగా రెండు, మూడు స్ధానాలను కొదండరాం పార్టీకి కేటాయించనట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను ఆశీస్తోండగా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రాహుల్‌తో భేటీలో సీట్ల పంపకాల గురించి చర్చ జరగలేదని తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని ఇద్దరం ఒక అభిప్రాయానికి వచ్చామని పేర్కొన్నారు కొదండరాం. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ పక్కా వ్యూహాంతోనే ముందుకు వెళ్తున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -