- Advertisement -

సమంత తరవాత రాకుల్ ప్రీత్ ఆ విషయం లో సూపర్

- Advertisement -

తెలుగు క్యూట్ హీరోయిన్ సమంత తన అవయవాల్ని దానం చేసిన తరవాత అందరూ ఆమె ని మెచ్చుకోవడం మొదలు పెట్టారు. సమంత మొదటి నుంచీ కూడా చాలా ప్రేమతో వివిధ రకాలు అయిన సేవా కార్యక్రమాలతో బిజీ గా ఉంటుంది.

తనకి వచ్చిన పారితోషికం లో చాలా మటుకూ పేదవారికి దానం చెయ్యడానికీ, పిల్లల చదువులకీ, వైద్యానికీ ఉపయోగిస్తూ ఉంటుంది ఆమె. ప్రత్యూషా ఫౌండేషన్ అంటూ ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా తన సేవ సాగిస్తోంది.ఆమె తరవాత ఇంకా చాలా మంది హీరోయిన్ లు అవయవదానం లో పాల్గొన్నారు, ఆమెకి ముందూ ఆమె కి తరవాతా  కాజల్ – శ్రుతిహాసన్ – హన్సిక – అనుష్క వంటి అందాల భామలు తమ అవయవాలు దానం చేసిన వారే. సైలెంట్ గా మంచి పనులు చెయ్యడం వారికి అలవాటే. ఇన్ని రకాలు గా సామాజిక సేవలో పాల్గొంటున్న వారు కాబట్టే అంత బిజీ లో కూడా మంచి వారి వెంటే వస్తుంది. రాకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో ఒక పెద్ద హీరోయిన్ గా రాణిస్తూ మరొక పక్క అపోలో – క్యూర్ ఫౌండేషన్ వారి సహాయం తో క్యాన్సర్ ఎవేర్నేస్ పెంచుతోంది. ఇవాళా నిన్నా ఆ కార్యక్రమం లో పాల్గొంది ఆమె. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీతో ఎలాంటి క్యాన్సర్లనయినా జయించవచ్చు.. అని ప్రపంచానికి చాటే ప్రోగ్రామ్ లో నేను సైతం అంటూ పాల్గొంది రకూల్. అప్పటికే క్యాన్సర్ మహమ్మారిని జయించిన చిన్న పిల్లలతో కలిసి కాసేపు ఆటలాడుకుంది. అందరినీ ఎంతో ఆనందంలో ముంచేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -