Saturday, May 4, 2024
- Advertisement -

క‌రోనాతో అనాథ‌లైన చిన్నారుల సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం!

- Advertisement -

దేశంలో ఇప్పుడు కరోనా బీభత్సం కొనసాగుతుంది. గత నెల నుంచి దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య దారుణంగా పెరిగిపోతూ వచ్చాయి. దాంతో రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే కరోనా మహమ్మరి కారణంగా చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కరోనా భారిన పడ్డవారు రక్షించుకునే ప్రయత్నం లో ఆస్తులు అమ్ముకుంటున్నారు.. అయినా కూడా చనిపోతున్నారు. దాంతో ఇంట్లో పిల్లలు అనాధలుగా మిగిలిపోతున్నారు.

క‌రోనాతో త‌ల్లిదండ్రులు, సంర‌క్ష‌ల‌‌ను కోల్పోయి అనాథ‌లైన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. వారి పేరిట ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామన్నారు.

ఇక దానిపై వడ్డీని నెలనెలా వారికి 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు అందేలా చూస్తామన్నారు. దీంతోపాటు, గ్రాడ్యుయేషన్‌ స్థాయి వరకు వారి చదువుకయ్యే అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇక‌, కోవిడ్‌తో అనాథ‌లైన చిన్నారుల‌ను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎంకే స్టాలిన్. మ‌రోవైపు.. క‌రోనాతో పిల్ల‌ల‌ను కోల్పోయిన త‌ల్లిదండ్రుల‌కు కూడా రూ.3 ల‌క్ష‌ల చొప్పున ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈటల బీజేపీలో చేరడం పక్కా.. అందుకే ఢిల్లీ వెళ్లారా?

కన్న తల్లిని కదా.. చూస్తూ ఆ పని చేయలేకపోయాను: నటి పావలా శ్యామల

తెలంగాణ ప్ర‌భుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి వైఎస్ షర్మిల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -