Sunday, May 12, 2024
- Advertisement -

సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నేడు.. మహేష్ బాబు ఎమోషనల్ ట్విట్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర హీరోలు సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలతో ఉర్రూతలూగిస్తున్న సమయంలో జేమ్స్ బాండ్,కౌబాయ్,సీఐడీ తరహా చిత్రాలతో అలరించారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. కౌబాయ్ తరహా చిత్రాలు తెలుగు తెరకు పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ.

ఆయన ఎంట్రీ తర్వాత ఫైటింగ్ సన్నివేశాల్లో వినూత్న ప్రయోగాలు చేశారు అన్నదానిలో అతిశయోక్తి లేదు. హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు.. ఈ చిత్రంలో అమాయకంగా నటించిన కృష్ణ తర్వాత గూఢచారి 116 చిత్రంతో సీఐడీ ఆఫీసర్ గా పెను సంచలనాలు సృష్టించారు. అల్లూరి సీతారామరాజు గా దేశభక్తి, సింహాసనం లాంటి జానపద చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నాడు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు.

1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశారు కృష్ణ. ఇండస్ట్రీలో కృష్ణ వారసులుగా మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు వచ్చారు. నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు ఓ ఎమోషనల్ ట్విట్ చేశారు.

పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు నాన్నా.. నా ముందుండి న‌న్ను నడిపిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. మిమ్మ‌ల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అంటూ ఎమోష‌నల్ క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. సూప‌ర్ స్టార్ 78వ పుట్టిన రోజు సందర్భంగ సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు కృష్ణ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఒక్క హిట్ తో బిజీగా మారిన కుర్ర హీరో!

రోజుకు 18 గంటలు కష్టపడ్డాం: రాశీఖన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -