Sunday, May 19, 2024
- Advertisement -

అన్న ముఖేష్‌కు పోటీగా త‌మ్ముడు అనిల్ ….

- Advertisement -
RCom Offers 28 Percent Discount on Select Postpaid Plans for One Year

ముఖేస్ అంబానీ తీసుకొచ్చిన రిల‌య‌న్స్ జియే దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.దెబ్బ‌కు టెలికంకంపెనీల‌న్నీ కుదేల‌య్యాయి. డాటా రేట్ల‌ను సామాన్యునినికి అందుబాటులోకి చ్చాయి.అయితే అన్న దెబ్బ‌కు త‌మ్ముడి ఆర్‌కామ్‌కు షాక్ త‌గ‌లింది.ఒక్క సారిగా అప్పుల్లో కూరుకుపోయింది.దీనినుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది ఆర్‌కామ్‌.

ఆర్థిక న‌ష్టాల్లోనుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఓ వైపు నుంచి వ్యూహాత్మ‌క‌ప్లాన్స్ అమ‌లు చేస్తూనే ..మ‌రో వైపు కొత్త వినియేగ‌దారుల‌ను అక‌ట్టుకోవ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నాలను ముమ్మ‌రం చేసింది.తమ పోస్ట్ పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కుప్లాన్స్ పై ఏడాది పాటు డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఎంపికచేసిన పోస్టు పెయిడ్ ప్లాన్స్ పై 28 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది.

{loadmodule mod_custom,GA1}

ఈ కొత్త డిస్కౌంట్ ప్లాన్స్ ఢిల్లీ, ముంబై, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లోని 4జీ యూజర్లకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త ఆఫర్స్ తో 1జీబీ 4జీ డేటా అతి తక్కువకు రూ.11.1కే అందుబాటులోకి రానుంది. త‌మ ప్లాన్స్ కూడా ఎవరైతే కంపెనీ పోర్టల్ rcom-eshop.com ద్వారా సబ్ స్క్రైబ్ అవుతారో వారికి మాత్రమేనని తెలిపింది. ఎంపికచేసిన నెలవారీ ప్లాన్స్ లో ఈ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
డిస్కౌంట్ తర్వాత నెలవారీ ప్లాన్స్ రూ.333, రూ.499కు అందుబాటులోకి వచ్చాయి. సబ్ స్క్రైబర్ కు ఈ డిస్కౌంటెడ్ ధరలు 12 నెలల పాటు ఆఫర్ చేయనున్నామని, డిస్కౌంట్ విలువ ఏడాదికి రూ.2400గా కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో రూ.509 ప్లాన్ కు పోటీగా రూ.499 ప్లాన్ ను ఆర్కామ్ ఆఫర్ చేస్తోంది. దీనికింద 30జీబీ 3జీ,4జీ,2జీ డేటా, హోమ్ సర్కిల్ లో అపరిమిత వాయిస్ కాల్స్, 3000 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ అందుబాటులో ఉంటున్నాయి.రూ.333 ప్లాన్ ను జియో రూ.309 ప్యాక్ కు పోటీగా తీసుకొచ్చింది.

{loadmodule mod_custom,GA2}

ఈ డిస్కౌంట్ ఆఫర్లతో తన నెట్ వర్క్ లోకి కొత్త సబ్ స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఆర్కామ్ ప్రయత్నిస్తోంది. వొడాఫోన్, ఎయిర్ టెల్, జియోల నుంచి వచ్చే పోటీని కూడా అధిగమించాలని చూస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -