Tuesday, May 14, 2024
- Advertisement -

కేసీఆర్ కు ఆ ధైర్యం లేకపోయిందా..?!

- Advertisement -

ముందస్తుగా మీడియాకు లీకులు ఇచ్చారు. కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబోతున్నాం అని ప్రకటించారు. ప్లీనరీ ఏర్పాట్లు న్నీ కేటీఆరే స్వయంగా చూసుకొంటున్నాడని కూడా కథనాలు రాయించుకొన్నారు.

ఇక అంతా అయిపోయింది.. టీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను అప్పగించడమే తరువాయి అనే భావనను కలగ చేశారు.

అయితే చివరకు మాత్రం వెనక్కు తగ్గారు.. కేసీఆర్ వర్కింగ్ మోడ్ లోనే ఉన్నాడు, మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు? అంటూ స్వయంగా కేటీఆర్ మీడియా ముందుకు వచ్చాడు. మొదట లీకులిచ్చిన వారే ఇలా వెనక్కు తగ్గడం వెనుక ఆంతర్యం ఏమిటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చేస్తారని ప్రచారం చేసి.. చివరకు మాత్రం అది చేయలేకపోయారు.
దీనికి కారణం ఏమిటో అంచనా వేయడం చాలా సులభమే. తెలంగాణ రాష్ట్ర సమితిలో వారసత్వ పోటీ తీవ్రంగానే ఉంది.  కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఏడాది కూడా పూర్తికాకుండానే.. ఆయన తదనంతరం పార్టీ, ప్రభుత్వ బాధ్యతలను స్వీకరించాలని పోటీ పడే వాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. వారిలో కేటీఆర్, హరీష్ రావులు ముఖ్యులు. ఎలాగూ కవిత ఉండనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ చాయిస్ అయితే కచ్చితంగా కేటీఆర్ అవుతాడు.
తనయుడు కావడం.. పార్టీని నడిపించగల సమర్థుడనే పేరును కలిగి ఉండటం కేటీఆర్ కు ప్లస్ పాయింట్లు. అయితే ఇవే సమర్థతలతో ఉన్నాడు హరీష్ రావు. అయితే ఈయన కేసీఆర్ కు మేనల్లుడు మాత్రమే. ఈ నేపథ్యంలో హరీష్ కు పార్టీ పగ్గాలు దక్కే అవకాశం లేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య కేటీఆర్ ను.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పై సహజంగానే హరీష్ రావు అలకను ప్రదర్శించి ఉండవచ్చు. దీంతో ఇప్పుడు ఈ తతంగాన్ని తలకెత్తుకొని తలనొప్పిని తెచ్చుకోవడం కంటే సైలెంట్ గా ఉండటం మేలని కేసీఆర్ ఈ ప్రక్రియను ప్రస్తుతానికి పక్కన పెట్టి.. స్వయంగా కేటీఆర్ తోనే ప్రకటన చేయించినట్టుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -