Sunday, May 5, 2024
- Advertisement -

కోడిపుంజుల‌ను మేప‌లేక నానాతంటాలు ప‌డుతున్న పోలీసులు..

- Advertisement -

పోలీస్ స్టేష‌న్ల‌లో ఖైదీలు లాక‌ప్‌లో ఉంటారు. కాని ఆ పోలీస్‌స్టేష‌న్‌లో మాత్రం కోళ్లు ఖైదీలుగా ఉన్నారు. అదంతా బాగానే ఉన్నా పోలీసులు మాత్రం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఆకోడి పుంజులు తంలో ఆకోడిపుంజులు మ‌హారాజులా బ్ర‌తికిన‌వి. పొద్దున్నే జీడిపప్పు, బాదంపప్పు నుంచి చికెన్, మటన్ వరకూ లాగించినవే. కానీ లాక‌ప్‌లో అవేవి ఉండ‌వుకాదా. వాటికి తిండి పెట్టలేక పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు.

ఇదంతా ఎందుక‌నుకుంటున్నారా…సంక్రాంతికి ముందు కోర్టు ఆదేశాల ప్ర‌కారం విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు పెడుతూ 9 పుంజులను, ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.

తరువాత వారిని, పుంజులను కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు నిలిపారు. మిగతా ప్రాంతాల్లోనూ అదుపులోకి తీసుకున్న కోడిపుంజులన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించడంతో వాటిని మళ్లీ వెనక్కు తీసుకువచ్చి, ఏం చేయాలో తెలియక, లాకప్ లో ఉంచారు. ఇప్పుడు అచ్యుతాపురం స్టేషన్ లాకప్ నేరాలకు పాల్పడిన వాళ్లకు బదులుగా కోళ్లతో నిండుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -