ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్డు రవాణ సంస్థ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. తమ జీతాలను పెంచాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఈ సమ్మె గురించి కార్మిక సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు.
అటు కార్మికులు, ఇటు ఉద్యోగులు ఎవరికి వారు తమ తమ పంతాలతో బెట్టు చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో రెండు రాష్ట్రాల పరిధిలోని బస్సులు ఇప్పటి వరకూ డిపోలు దాటలేదు. బలవంతం కొద్దీ ఒకటీ రెండు బస్సులను తిప్పడమేకానీ సమ్మె చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతోంది.ఇక ప్రయాణికుల తిప్పలు అయితే వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆర్టీసీకి కూడా నష్టం తీవ్రంగానే ఉందని తెలుస్తోంది.
సమ్మెవల్ల ఇప్పటి వరకూ దాదాపు 128 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. బస్సులు ఎక్కడివక్కడ నిలిచి పోవడంతో ఈ నష్టం సంభవించింది.అసలే తవ్ర నష్టాలతో అల్లాడిపోతున్న ఆర్టీసికి ఇది మరింత దెబ్బ అని చెప్పవచ్చు. జీతాల పెంపుదల కోరుతున్న ఉద్యోగులు ఈ నష్టం పట్ల చలించడం లేదు.. ప్రభుత్వం కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో 70 కోట్ల రూపాయలు, తెలంగాణలో 58 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. మరి ఈ భారీ నష్టం ఆర్టీసిని ఇంకా ఎంతలా దెబ్బతీస్తుందో!
