Monday, May 13, 2024
- Advertisement -

రవికిరణ్ ను అరెస్ట్ చేసారు సరే.. మరి వీళ్ల సంగతి ఏంటి బాబులు..?

- Advertisement -
Satirist Ravi Kiran Arrested For Cartoon on Chandrababu Naidu

ఏపీలో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఒక సామాన్యుడు తమకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడని అరెస్టుకు ఆదేశించిన టీడీపీ ప్రభుత్వం తన పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇతర పార్టీలకు చెందిన నాయకుల వ్యక్తిత్వాలను కించపరిచేలా పెట్టిన పోస్టులపై మాత్రం నోరు విప్పడం లేదు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై టీడీపీ వెబ్‌సైట్‌లో ఓ రెంజ్ లో పెట్టిన పోస్టుల్లో ఇవి కొన్ని మాత్రమే.

అయితే టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పొలిటికల్‌ పంచ్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్‌ (35)ను అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై వెబ్‌సైట్‌లో అభ్యంతరకరంగా ప్రచారం చేస్తున్నందుకుగాను అరెస్ట్‌ చేస్తున్నామని పోలీసులు అరెస్ట్‌ సమయంలో అన్నారు. అయితే సోషల్ మీడియాలో రవికిరణ్‌ అరెస్ట్‌పై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ప్రభుత్వ పనితీరు సరిగాలేదని విమర్శిస్తే అరెస్ట్‌లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.

అయితే ప్రతిపక్ష నేత క్యాబినెట్ హోదా ఉన్న ఒక నాయకుడ్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన ఈ పేజీల అడ్మిన్ లను అరెస్ట్ చేస్తారా ?..బాబు సర్కారు సమాధానం చెప్పాలి అని నెట్ జన్లు ప్రశ్నిస్తున్నారు . అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన నేతలకు ఒక న్యాయం ..ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలకు ఒక న్యాయమా ..?.ఎవరికైనా మనోభావాలు ఒకటే కదా ..మరి అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కించ పరిచే విధంగా పోస్టులు పెడుతోన్న గ్రూపుల ,పేజిల అడ్మిన్ లను అరెస్ట్ చేయాలి కదా అని నెట్ జన్లు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. త్వ‌ర‌లో వేలి ముద్ర‌ల‌తో కూడిన‌ఏటిఎం కార్డులు
  2. నంద్యాల ఉప ఎన్నిక పోరు.. భూమా వ‌ర్సెస్ శిల్పా
  3. సోషల్ మీడియాలో వైసీపీ సరికొత్త విప్లవం..
  4. చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న బిజేపీ.. జగన్ సీఎం పక్కా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -