Thursday, April 25, 2024
- Advertisement -

కీర‌దోస‌.. బరువు త‌గ్గించే సులువైన మార్గం..!

- Advertisement -

నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో వచ్చిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే బ‌రువు త‌గ్గ‌డానికి అనేక క‌ష్ట‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే, సులువుగా బ‌రువు త‌గ్గ‌డానికి కీర దోసకాయ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వేస‌వికాలంలో అధికంగా ల‌భించే ఈ కీర‌దోస కాయ‌ల‌ను తీసుకునే విష‌యంలో డైట్ ఫాలో అయితే, త‌క్కువ స‌మ‌యంలో అద్బుత‌మైన ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చున‌ని నిపుణులు సూచిస్తున్నారు. కేవ‌లం 14 రోజుల వ్య‌వ‌ధిలోనే దాదాపు ఏడు కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ట‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం కీర‌దోసకాయ‌లో ఉండే త‌క్కువ కేల‌రీల‌తో పాటు, ఔష‌ధ గుణాలే కార‌ణ‌మ‌ని నిపుణులు చెపుతున్నారు.

కాగా, కీర‌దోస‌కాయ డైన్ ఫాలో అవ్వ‌డానికి పెద్దగా పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌లు ఏమీ లేవు. రోజువారీగా తీసుకునే ఆహారాన్ని త‌గ్గించి.. ఆక‌లి వేసిన‌ప్పుడ‌ల్లా కీర‌దోస‌కాయ‌ను తీసుకోవాలి. అయితే, కీర‌దోస‌లో త‌క్కువ కేల‌రీలు, త‌క్కువ ప్రోటిన్లు ఉంటాయి. కాబ‌ట్టి కీర‌దోస డైట్ ఫాలో అవుతుంటే కీర‌దోస‌తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయ‌లు సైతం ఆహారంగా తీసుకుంటే ఇత‌ర అనారోగ్య సమస్యలు ద‌రిచేర‌కుండా ఉంటాయి.

తేలిక‌గా తీసుకోవ‌ద్దు.. క‌రోనాపై ఎయిమ్స్‌ చీఫ్‌ వార్నింగ్‌!

నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

హ‌రిద్వార్ కుంభ‌మేళలో అద్భుతం.. నీటిపై తేలుతున్న రాళ్లు

టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది: బండి సంజ‌య్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -