దారుణం : బిస్కెట్ల ఆశ చూపి ఆరేళ్ళ బాలికపై అత్యాచారం !

నేటి రోజుల్లో అత్యాచార ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికి మహిళలపై జరుగుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన రాక్షసులు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. ఇటీవల చిన్న పిల్లలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలు కామాంధుల మదమేధానికి బలౌతు కన్నా వాళ్ళకు కన్నీళ్లు మిగిలిస్తున్నారు.

ఇక తాజాగా హరియాణ రాష్ట్రంలో పానిపట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ళ బాలికపై బిస్కెట్ల ఆశ చూపి ఈశ్వర్ సింగ్ అనే వ్యక్తి ఆ చిన్న పాపను అత్యాచారం చేసి ఆపై గొంతు నుమిలి హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..అతడు గతంలో ఉత్తరాఖండ్ లో నివసించే వాడని, పానిపట్ కు వలస వచ్చి అక్కడే ఢాబాలో పని చేసేవాడని పోలీసులు వారి వివరాల్లో తెలిపారు.

ఆరేళ్ళ పాప తన ఇంటి సమీపంలో ఉన్న పార్క్ లో రెండేళ్ల వయసున్న తన తమ్ముడితో ఆడుకుంటూ ఉండగా బిస్కెట్ల ఆశ చూపి ఆ పాపను అపహరించి ఆ తరువాత అత్యాచారానికి పాల్పడినట్లు పొలుసులు వారి విచారణలో తెలిపారు. నిందితుదిని ఆధుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కఠిన చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇక మృతి చెందిన ఆ పాప మృతదేహాన్ని పోస్టుమార్టం తరువాత తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.

Related Articles

Most Populer

Recent Posts