Monday, May 13, 2024
- Advertisement -

మనకు పేరే తెలియని సూపర్ స్మార్ట్ ఫోన్లు ఇవిగో!

- Advertisement -

స్మార్ట్ ఫోన్ నేటి జీవితంలో ఒక తప్పనిసరి అవసరం. అక్షరాలు రాని వారికి కూడా వీటిని వాడటం విషయంలో అవగాహన ఉంటుంది..

ఇక ఉద్యోగ.. వ్యాపార వ్యవహారాల్లో కూడా మామూలు ఫోన్లు కాకుండా.. స్మార్ట్ ఫోన్లే అవసరం అవుతున్నాయి! మరి ఇలాంటి పరిస్థితుల్లో మంచి స్మార్ట్ ఫోన్ ఏది? అంటే.. ఎవరికి వారు తమకు తెలిసిన పేర్లు చెబుతారు. యాపిల్ , ఎల్ జీ , శాంసంగ్, లావా, షియామీ.. ఇలా కొన్ని ప్రముఖ బ్రాండ్ల పేర్లను చెప్పేస్తుంటారు. మరి ఇంతేనా.. ఇంకా ఉన్నాయి కానీ వాటి ప్రమాణాలు అంతగా బావుండవేమో అనే సమాధానమూ వినిపిస్తుంది. అయితే మన దేశం వరకూ ప్రచారం పొందని, పాపులారిటీకి దూరంగా ఉంటూ.. విదేశాల్లో మంచి మార్కెట్ ఉన్న ఫోన్లు కొన్ని ఉన్నాయి. మన ముందు బాగా ప్రచారం చేసి.. నోటెడ్ అయిన స్మార్ట్ ఫోన్లకు ధీటుగా సేవలు అందించగలవివి. అయితే ఇండియా వరకూ ప్రచారం సరిగా లేకపోవడంతోనే వీటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటివి కొన్ని..
టీహెచ్ ఎల్ ( THL 5000)
ఈ స్మార్ట్ ఫోను బ్రాండ్ ప్రధానంగా యూకే, యూఎస్ లలో ఫేమస్. దీని ప్రత్యేకత చార్జింగ్ లైఫ్ ఇవ్వడం. 5000mAh బ్యాటరీతో ఉండే ఈ ఫోను చార్జింగ్ విషయంలో ఛాంపియన్. 1080 హెచ్ డీ డిస్ ప్లేతో ఉండే ఈ ఫోను ధర దాదాపు 16,000 రూపాయలు.
లుమిగాన్ (Lumigon T2 HD)
స్టైలిష్ లుక్ తో ఉండే ఈ ఫోను వాటర్ , డస్ట్ రెసిస్టెంట్. ఈ ప్రత్యేకతలతో ఉండే ఈ ఫోను ధర దాదాపు 36 వేల రూపాయల వరకూ ఉంటుంది. ప్రధానంగా డెన్మార్క్ , ఇంగ్లాండ్ లలో దొరుకుతుంది. 128 జీబీ వరకూ మెమోరీని ఎక్స్ టెండ్ చేసుకోగలగడం ఇది అందించే సదుపాయం.
కూల్ ప్యాడ్ (Coolpad’s Magview 4)
గత ఏడాదిలో చైనా లో బాగా అమ్ముడైన ఫోన్ ఇదే. అద్భుతమైన ఫీచర్లతో అదుర్స్ అనిపించుకొనే ఈ స్మార్ట్ ఫోన్ ఆ ఫీచర్ల తో పోల్చుకొన్నప్పుడు చీప్ గా పేరు పొందింది. అయినా దీని ధర 40 వేల రూపాయల వరకూ ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే… Fairphone,Yotaphone 2, NEC Terrain, KT Tech KM-E100, MEIZU MX4, Posh Mobile Titan HD E500 వంటి స్మార్ట్ ఫోన్లున్నాయి. ఇవన్నీ కూడా మంచి మంచి ఫీచర్లతో.. ఉండి కూడా మనదేశంలో తక్కువ ప్రచారం పొందిన ఫోన్లు. మన దగ్గర పాపులారిటీ ఉన్న ఫోన్లకు తీసిపోని స్థాయిలోనివి ఇవి. మరి మన మార్కెట్ లో ఉన్న ఫోన్లేవీ నచ్చకపోతే కొత్తదనం కావాలంటే వీటి కోసం ట్రై చేయవచ్చు. కాస్త ట్రై చేస్తే ఇవి మన మార్కెట్ లో కూడా దొరుకుతాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -