Monday, May 13, 2024
- Advertisement -

కొనాల‌నుకుంటె అక్క‌డ‌కు వెల్లాల్సిందే…..

- Advertisement -

అధునిక టెన్నాల‌జీ, ఇంట‌ర్నెట్ ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత అంద‌రూ ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై మోజు పెంచుకుంటున్నారు. ప్ర‌ధానంగా ల్యాప్‌ట్యాప్‌లు , స్మార్ట్ ఫోన్‌లు ఇవి లేని వారుండ‌రు. ల్యాప్‌టాప్‌ల‌ను త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేసేందుకు ఎక్కువ‌గా ఆఫ‌ర్ల వైపు చూస్తుంటారు ప్ర‌జ‌లు. ఒక ల్యాప్ ట్యాప్ కొనాలంటె క‌నీసం రూ.20,000 ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా పండుగ సమయాల్లో షాపింగ్‌మాల్స్‌ భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆషాఢం సేల్‌, శ్రావణ మాసం సేల్‌ పేరుతో కేజీల చొప్పున దుస్తులు అమ్మడం మ‌నం చూస్తుంటాం. అలా ల్యాప్‌టాప్‌లు కూడా కేజీల్లో అమ్మితే ఎలా ఉంటుంది? అనుకుంటున్నారా…? మనకు కావాల్సిన ల్యాప్‌టాప్‌ను అతి తక్కువ ధరలో మన సొంతం చేసుకోవచ్చు అనుకుంటున్నారు కదూ…! అయినా ల్యాప్‌టాప్‌లు ఎక్కడైనా కేజీల్లో అమ్ముతారా? న‌మ్మ‌కం కుద‌ర‌డంలేదా…? మ‌ఈరు విన్న‌ది నిజ‌మే.

ఢిల్లీలో ఉన్న నెహ్రూ ప్లేస్ ల్యాప్‌టాప్‌ మార్కెట్‌లో అతి తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు కిలోల చొప్పున అమ్ముతారు. ఇది భారతదేశంలోనే కాక ఆసియాలో అతిపెద్ద, చౌకైన ల్యాప్‌టాప్‌ మార్కెట్. ఇక్కడ కిలో రూ.5-7 వేలకే ల్యాప్‌టాప్‌ కొనుక్కోవచ్చు. ఈ నెహ్రూ ప్లేస్‌లో దుకాణాలు వందల్లో ఉన్నాయి.

నెహ్రూ ప్లేస్ మార్కెట్‌లో ల్యాప్ టాప్‌లు మాత్రమే కాదండోయ్‌…. స్మార్ట్ ఫోన్‌లు, ఇత‌ర కంప్యూట‌ర్స్‌, మొబైల్‌ యాక్ససరీస్‌తోపాటు అన్ని ర‌కాల ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల‌ను అమ్ముతారు. అయితే కొనే ముందు ఒక‌టికి రెండు సార్లు ప‌రీక్షించి చూసుకోవాలి. వినియేగ దారుడు మోస‌పోవాల్సి వ‌స్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -