Sunday, May 12, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో బాబుపై పేలుతున్న పంచ్‌లు…

- Advertisement -
Social Media setairs on AP Secretariat and Assembly

ఈమ‌ధ్య‌న చంద్ర‌బాబు..ఆయ‌న కొడుకు లోకేష్‌పై నెటిజ‌న్లు సోషియ‌ల్ మీడియా ద్వారా చెడుగుడు అడుకున్నారు.మీడియా మొత్తాన్ని త‌న చెప్పుచేతుల్లో పెట్టుకున్న బాబుకు సోష‌ల్‌మీడియా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

నిన్న‌టి వ‌ర‌కు అనాలోచితంగా మాట్లాడిన‌లోకేష్ ఆడుకున్న సోషియ‌ల్‌మీడియా ఇప్పుడు తాజాగా స‌చివాల‌యం నిర్మానంలో చంద్ర‌బాబును దుమ్ముదులిపేసింది.
చిన్న‌పాటి వ‌ర్షానికే వెల‌గ‌పూడి స‌చివాల‌యం, అసెంబ్లీ భ‌వ‌నాలు నీట ముగ‌న‌డంపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.నెటిజ‌న్లు ఊరుకుంటారా..త‌మ క‌ల‌ను అంతా రంగ‌లించి బాబుపై జోకులు,కార్టూన్‌లుతో సెటైర్లు పేలుస్తున్నారు.స‌ర‌దాగా స‌చివాల‌యంలో ఈత‌కు వెళ్తున్నా వ‌స్తావా.. అని ఒక‌డు.. స‌చివాల‌యం వ‌ర్షానికి కార‌లేదు. ఎండ‌ల నుంచి ఉప‌శ‌మనం కోసం బాబు గారు విదేశీ టెక్నాలజీ స‌హాయంతో ఏర్పాటు చేసిన జ‌ల‌పాతం అది అంటూ కామెడీజోకులు పేలుస్తున్నారు.

{loadmodule mod_custom,GA1}

ఎవ‌ర‌య్యా బాబు హ‌యాంలో వ‌ర్షాలు ప‌డ‌వ‌నింది..చూడండి ఏకంగా అసెంబ్లీ,స‌చివాల‌యంలోనే వ‌రుణ‌దేవుడు వ‌ర్షాన‌న్ని కురిపించారు.మ‌రొక మిత్రుడు భ‌విష్య‌త్తులో నిర్మించ‌బోయే రాజ‌ధానిలో బాహుబ‌లి జ‌ల‌పాతం నిర్మాణం.. పంచ్.సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మ‌ల‌చుకోవాలనేది బాబు గారి ఉపేద‌శం అందుకే స‌చివాల‌యంలో కాగిత ప‌డ‌వ‌ల కుటీర ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు విదేశీ సంస్థ‌ల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఒప్పందం.. ఒక సోష‌ల్ యాక్టివిస్ట్ చుర‌క‌.
అసెంబ్లీలో వ‌ర్షం వెనుకు జ‌గ‌న్ కుట్ర‌ని మ‌రొక‌రు పంచ్‌లు విశిరారు…దీనికి నైతిక బాధ్య‌త వహిస్తూ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాజీనామా చేయాలి.ఇంకొకాయ‌న ఎగ‌తాళి. ఏంద‌య్యా కాంట్రాక్ట‌రూ ఇలా క‌ట్టావు.. లేదు సార్ మేం కూడా మోస‌పోయాం సార్‌.. మీరు ఉన్న చోట వ‌ర్షాలు ప‌డ‌వ‌ని అధికారులు చెప్పారు. అందుకే ఇలా క‌ట్టాం.అయినా తాత్కాలిక భ‌వ‌నాలు క‌దా సార్‌.

{loadmodule mod_custom,GA2}

ఇలా బాబు గారి మీద ప‌డుతున్న పంచ్‌ల‌ను రాసుకుంటూ పోతే వంద జీబీ మెమొరీ స‌రిపోదు. బాబుపై వ‌స్తున్న విమర్శ‌ల జ‌డివాన‌ను ఎలా అడ్డుకోవాలో తెలియ‌క టీడీపీ సోష‌ల్ మీడియా విభాగం త‌ల‌లు ప‌ట్టుకుంటోంది.త‌న సొంత ఆస్థాన మీడియా అయితే క‌నీసం నోరు మెద‌ప‌డంలేదు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -