మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు శ్రీదేవి హల్‌చల్ చేసింది. చిరంజీవిని కలవాలని ఉంది అని చెప్పండి. శ్రీదేవీ వచ్చిందని చెప్పండి చాలు.. ఆయనకు బాగా తెలుసు అని శ్రీదేవీ అనే మహిళ కూర్చుండిపోయింది. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్రీదేవి(40) వచ్చింది జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి ఇంటి ఎదుట శుక్రవారం అర్థరాత్రి వచ్చి కూర్చుంది. పొద్దుగాల సెక్యూరిటీ చూసి ఎవరు కావాలని అడగ్గా చిరంజీవిని కలవాలని ఉంది అని చెప్పింది.
ఎవరు కావాలని అడగ్గా.. ‘చిరంజీవికి తను బాగా తెలుసని, చిరంజీవికి శ్రీదేవి వచ్చిందని చెప్పాలని’ చెప్పింది. సెక్యూరిటీ వారు మిగతా వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఏమీ చెప్పలేదు. కేవలం ‘శ్రీదేవీ వచ్చిందని చెప్పితే చాలు.. చిరంజీవి గుర్తుపడతారని’ కూర్చుండిపోయింది. ఏమీ చెప్పకుండా అలాగే ఇంటిముందు ఆమె కూర్చొవడంతో సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వచ్చి తీసుకెళ్లి పోయారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఆమె సోదరికి అప్పగించి పంపివేశారు.
