- Advertisement -

మోహన్ బాబు యూనివర్సిటీలో యువతి సూసైడ్

- Advertisement -

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళం ప్రాంతానికి చెందిన ఆమె, కాలేజీ బయట ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో నివసిస్తోంది.

హాస్టల్ గదిలో ఉరివేసుకున్న స్థితిలో ఆమెను గమనించిన సహవాసులు వెంటనే నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అనంతరం యువతిని అత్యవసరంగా నారావారిపల్లె సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వ్యక్తిగత, విద్యా సంబంధిత ఒత్తిడులు లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేశారు.

యువతి ఆకస్మిక మరణం విశ్వవిద్యాలయ వర్గాల్లో విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -