ఆదిత్యాయ నమః

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని.. అత్యంత పురాతన సూర్యభగవానుడి ఆలయంలో.. మరోసారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయ భానుడి లేలేత కిరణాలు నేరుగా స్వామివారి మూలవిరాట్ ను తాకాయి. ఏడాదికి రెండుసార్లు మాత్రమే కనిపించే దృశ్యాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు.

ఈ కిరణాల స్పర్శవలన దేవతామూర్తుల విగ్రహాలు బంగారు వర్ణంతో  ధగధగ మెరిసిపోయాయి.