Monday, May 6, 2024
- Advertisement -

టీడీపీకీ షాక్‌….వైసీపీలో చేరిన ప్ర‌ముఖ‌పారిశ్రామిక వేత్త‌

- Advertisement -

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడీపీకీ బిగ్ సాక్ త‌గిలింది. టీడీపీకీ చెందిన ప్ర‌ముఖ పార‌శ్రామికవేత్త ర‌ఘురామ‌కృష్ణం రాజు తిర‌గి సొంత గూటికి చేరుకున్నారు. కొంతకాలంగా రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో జ‌గ‌న్‌తో భేటీ అయిన ఆయ‌న పార్టీకండువా క‌ప్పుకున్నారు.

ఈ ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రఘురామ కృష్ణంరాజును స్వయంగా కారులో తీసుకువచ్చిన విజయసాయిరెడ్డి, ఆయన్ను జగన్ కు పరిచయం చేశారు. అనంత‌రం జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. టీడీపీలో తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదన్న మనస్తాపంతో ఉన్న గ‌త కొంత కాలంగా టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. త‌

పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజును బరిలోకి దింపాలని టీడీపీ ప్లాన్ చేసింది. అయితే టీడీపీలో చోటు చేసుకున్న కొన్ని ప‌రిణామాల‌తో పీకే టీమ్ తో ఇటీవ‌ల ఆయ‌న క‌ల‌సిన‌ట్లు వార్త‌లు రావ‌డంతో టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయ‌న‌కు నరసాపురం ఎంపీ టిక్కెట్టు విషయమై అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజును ఫైనల్ చేయలేదని అంటున్నారు. దీంతో టికెట్ రాద‌నే విష‌యం తెలియ‌డంతో వైసీపీలో చేరారు.

గతంలో వైసీపీని వీడిన సమయంలో వైఎస్ జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు మళ్లీ తిరిగి ఆయన చెంతకే చేరారు. అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండర‌నేది నిజం. రాష్ట్ర అభివృద్ధి జ‌గ‌న్ చేత మాత్ర‌మే సాధ్య‌ప‌డుతుంద‌ని వైసీపీలో చేరిన‌త త‌ర్వాత ర‌ఘురామ‌కృష్ణం రాజు అన్నారు. త‌ట‌స్తులు కూడా జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకుంటున్నార‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -