- Advertisement -

చెత్త లం**కొడకా..అధికారిపై టీడీపీ నేత!

- Advertisement -

రాజాం నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగిపై టీడీపీ కార్యకర్తలు దుర్భాషలాడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రేగిడి మండలం చిన్నశిర్లాం పంచాయతీకి చెందిన గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శిపై కొందరు కార్యకర్తలు అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

ఉపాధి హామీ పనులకు సంబంధించిన సోషల్ ఆడిట్ గ్రామసభ నిర్వహణ విషయంలో ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. గ్రామసభకు నేరుగా సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ, కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా దూషణలకు దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “నేరుగా నాయకులకు చెప్పకుండా మెసేజ్ పెడ్తావా?”, “ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో… నీ సంగతి చూస్తాం” అంటూ బెదిరింపులు చేసినట్లు సమాచారం.

ఇక “ఆఫీసులో పెట్టి కొడ్తాం”, “ఊరిలోకి రారా” వంటి హెచ్చరికలతో భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అసభ్య పదజాలం ఉపయోగించారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిపై ఈ తరహా ప్రవర్తన తీవ్రంగా ఖండించదగ్గదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఘటనపై స్పందించే అవకాశం ఉంది. సంబంధిత అధికారుల దృష్టికి విషయం వెళ్లినట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -