Sunday, May 19, 2024
- Advertisement -

ప్రజల్లో టీడీపీ రేటింగ్ దారుణంగా పడిపోయింది – తీదేపీ నేత సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

ప్రపంచ ప్రసిద్ద రాజధాని అమరావతి తన శంకుస్థాపన మహోత్సవానికి ముస్తాబు అవుతున్న వేళ, దేశం యావత్తూ ఈ మహోత్న కార్యక్రమం కోసం ఇటువైపే చూస్తున్న సమయం లో టీడీపీ కే చెందినా ఎంపీ భిన్నంగా మాట్లాడుతూ ఉండడం ఆశ్చర్యంగా ఉంది. 

పోయిన ఎన్నికలకి ముందు ఊహించని రీతిలో తెలుగుదేశం లోకి వచ్చిన రాయపాటి సాంబశివరావు టీడీపీ టికెట్ పొంది ఎంపీ అయ్యారు. తనదైన శైలి లో మీడియా ముందు మాట్లాడే అలవాటు ఉన్న రాయపాటి ప్రస్తుతం పరిస్థితుల గురించి మాట్లాడుతూ శంకుస్థాపన కి రాను అంటున్న జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ” మంచిది” అని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఒక అధికార పార్టీ మనిషి అందునా ఎంపీ అయ్యుండి రాయపాటి ఈ విధంగా స్పందించడం తెలుగు తమ్ముళ్ళకి మింగుడు పడని విషయం గా చెప్పాలి.

జగన్ నిర్ణయం మంచిదని చెబుతూనే ఎందుకు మంచిది అనే ప్రశ్నని మాత్రం ఆయన దాటవేశారు. భారత ప్రధాని తెలుగు ప్రజల మీద ఉన్న గౌరవంతోనే తెలుగు రాష్ట్ర రాజధాని కోసం వస్తున్నారు అని ఆయన పర్యటన రాజకీయపరమైనది కానే కాదు అని అన్నారు. ఆంధ్ర ప్రజలు ఆయన రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని శంకుస్థాపన కంటే ఆయన ప్రత్యేక హోదా మీద ఒక పాజిటివ్ ప్రకటన చేస్తారనే ఆలోచనలో ప్రజలంతా ఉన్నారు అని రాయపాటి అంటున్నారు.

ఎపి ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌లను నిజం చేయాల‌ని, ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ప్రధాని మోడీ రాక ఎంతో కీలకమని ఆయన గనక ఈ సమయం లో ఏపీ ప్రజలకి ఒక అండగా తాము ఉన్నాము అంటూ ప్రకటన చెయ్యకపోతే బీజేపీ రేటింగ్ పడిపోతుంది అని ఊహించని మాట చెప్పారు. ఇప్పటికే బీజేపీ రేటింగ్ తీవ్రంగా పడిపోయింది అని మోడీ ఇప్పటికైనా మేల్కొకపోతే ఇంకా దిగాజారితీరుతుంది అని రాయపాటి అభిప్రాయపడ్డారు. విపక్షం విషయం లో ” మంచిదే” అంటూ జగన్ కి కితాబు ఇచ్చి, మిత్ర పక్షం బీజేపీ కి హెచ్చరిక చేసిన ఈ సీనియర్ నేత సొంత పక్షం అయిన టీడీపీ ని కూడా వదలలేదు. ప్రజల్లో టీడీపీ రేటింగ్ సంగతేంటి అని అడగగా ” తెలుగు దేశం రేటింగ్ పడిపోయి చాలా కాలం అయ్యింది, బీజేపీ చేసిన పనులు స్వ పనులూ కారణంగా ఈ రేటింగ్ పడిపోయింది” అంటూ సమాధానం చెప్పారు. కానీ ఎవరి రేటింగ్ ఎలా ఉన్నా, ఎవరు ఎలాంటి ” మంచి ” పని చేసారు అన్నా దానికి కారణం చెప్పకపోవడం గమనార్హం. 

ఇక్కడ మరొక ట్విస్ట్ పెట్టారు రాయపాటి, టీడీపీ రేటింగ్ పడిపోయింది అంటూనే ఆ పార్టీ లీడర్ కి వెన్న పూసే పనిలో పడ్డారు. పాపం చంద్ర‌బాబు మాత్రం త‌మ పార్టీ రేటింగ్‌ను పెంచేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు చాలా క‌ష్ట‌ప‌డుతున్నారంటూ సానుభూతి చూపించారు రాయ‌పాటి. పార్టీ అనేది ఆ పార్టీ అధ్యక్షుడి చెప్పు చేతల్లో ఉంటుంది, ఆయన ప్రవర్తన, తీసుకున్న నిర్ణయాల మీదనే అసలు కథ నడుస్తుంది అలాంటిది పార్టీ రేటింగ్ పడిపోవడం జరిగి పార్టీ అధ్యక్షుడి రేటింగ్ పడకుండా ఉండడం ఏంటో !! ఇదేదో సానుభూతి చూపిస్తున్నట్టు ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -