Wednesday, April 24, 2024
- Advertisement -

సాయి గణేష్ ఆత్మహత్య కేసు ప్రకంపనలు

- Advertisement -

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. మంత్రి పువ్వాడ అజయ్ ప్రోద్బలంతో తన పై తప్పుడు కేసులు పెట్టారని మరణించే ముందు సాయి గణేష్ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనతో ఖమ్మం నగరం బీజేపీ నేతలు, కార్యకర్తల ఆందోళనలతో అట్టుడికింది.

తాజాగా ఈ వ్యవహారంలో మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అజయ్ తో పాటు కేంద్ర హోంశాఖ, ఖమ్మం పోలీసు కమిషనర్, త్రీటౌన్ ఎస్ హెచ్ వో, సీఐ, సీబీఐ, స్థానిక టీఆర్ఎస్ నేత ప్రసన్న కృష్ణ‌ తదితరులకు కోర్టు నోటీసులు ఇచ్చింది.

ఈ కేసుపై సీబీఐతో విచారణ జరపాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని మంత్రి అజయ్ సహా ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది.

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్

మాల్యా, నీరవ్‌ లను రప్పించే ప్రయత్నం

మళ్లీ హస్తినకు కేసీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -