Saturday, April 20, 2024
- Advertisement -

పోలీసు కాళ్లమీద పడ్డ రైతన్న..! ఎందుకంటే?

- Advertisement -

తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలా చోట్ల కలాల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదు. సీఎం కేసీఆర్​ వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతలను సహకార బ్యాంకులకు అప్పగించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ధాన్యం కొనుగోళ్లలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతుల ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు పరిశీలించి.. తేమ శాతం ఆధారంగా ధాన్యం కొనుగోలుకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల హమాలి కొరత, గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోంది. మరికొన్ని చోట్ల వ్యవసాయ​అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో రైతుల వద్ద వున్న ధాన్యం అమ్ముడు పోవడం లేదు.

కొన్ని చోట్ల వ్యవసాయ​ధికారులు, మిల్లర్లు, వ్యాపారులు కలిసి రైతులను దోపిడీ చేస్తున్నారు.దీంతో చాలా ప్రాంతాల్లో రైతులు తమ ధాన్యాన్ని తగలబెడుతూ నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. వికారాబాద్​ జిల్లా పాలెపల్లికి చెందిన ఓ రైతు తన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రెండ్రోజులుగా వికారాబాద్ లో ధర్నా చేస్తున్నాడు. అయినప్పటికీ రైతును అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.

Also Read: బిడ్డ ఎదురుగా కింగ్ కోబ్రా.. ఆ తల్లి ఏం చేసిందంటే?

దీంతో రైతు పోలీసు కాళ్ల మీద వేడుకున్నాడు. తన వరిధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయడం లేదని.. ఇప్పటికైనా కొనుగోలు చేయాలని ప్రాధేయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టాలు ఈ ప్రభుత్వాలకు పట్టవా? అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ తీరును నెటిజన్లు సైతం ఖండిస్తున్నారు.

Also Read: కోవాగ్జినా.. కోవిషీల్డా ఏది బెటర్​? ఇదిగో ఆన్సర్​

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -