Friday, April 26, 2024
- Advertisement -

సినీ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి…

- Advertisement -

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు వేణుమాధవ్ మృతిచెందినట్టు ఆయన సోదరుడు గోపాలకృష్ణ వెల్లడించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈనెల 6న ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన్ని ఐసీయూలోకి మార్చారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కాని పరిస్థితి విషమించిపోవడంతో వేణుమాధవ్ తుది శ్వాస విడిచారు.

వేణుమాధవ్ మృతదేహాన్ని మధ్యాహ్నం 2 గంటలకు కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఉన్న ఇంటికి తీసుకెల్లనున్నట్లు ఆయన సోదరుడు గోపాలకృష్ణ వెల్లడించారు.వేణుమాధవ్‌కు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుమాధవ్ స్వస్థలం సూర్యపేట జిల్లా కోదాడ. 1979 డిసెంబర్ 30న ఆయన జన్మించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్.. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాస్యనటుడిగా ఎదిగారు.

గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న వేణుమాధవ్ రాజకీయాల్లోనూ కాలుమోపారు. రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనప్పటికీ నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసి వార్తల్లో నిలిచారు.గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించినా ఆయన నామినేషన్ ను తిరష్కరణకు గురయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -