Saturday, May 4, 2024
- Advertisement -

90 ఏళ్ల వృద్ధురాలికి మొదటి ఫైజర్ టీకా..!

- Advertisement -

ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టానికి బ్రిటన్​ శ్రీకారం చుట్టింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీని మంగళవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ఉత్తర ఐర్లాండ్​కు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలికి మొదటి ఫైజర్ టీకాను అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఫైజర్​ టీకాను పొందిన తొలి వ్యక్తి(ప్రయోగాలు మినహా)గా మార్గరెట్​ కీనన్(మ్యాగీ)​ చరిత్రలో నిలిచిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:31 గంటలకు కావెన్ట్రీ ఆసుపత్రి నర్సు మే పార్సన్స్​.. మ్యాగీకి టీకాను ఇచ్చారు.

నాలుగేళ్ల ముందు వరకు ఓ నగల దుకాణంలో అసిస్టెంట్​గా పనిచేశారు మార్గరెట్​. ఆమెకు ఇద్దరు సంతానం, నలుగురు మనవళ్లు ఉన్నారు.మార్గరెట్​కు 21 రోజుల తర్వాత మరో డోసును ఇవ్వనున్నారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు.. బ్రిటన్​ బాటలోనే ప్రయాణిస్తున్నాయి. తమ దేశ ప్రజలకు టీకాను అందించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -