Tuesday, April 30, 2024
- Advertisement -

బ్రిటన్ ప్రధానిగా ఇండియన్స్ .. నిలుస్తారా ?

- Advertisement -

ప్రస్తుతం బ్రిటన్ లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అక్కడ ప్రధానిగా ఉన్న జాన్సన్ బోరిస్ పై అసహానంగా ఉన్న అక్కడి కేబినెట్ మంత్రులు 50 మంది రాజీనామా చేయడంతో బోరిస్ తన ప్రధాన మంత్రికి రాజీనామా చేయక తప్పలేదు. ఇక ప్రస్తుతం బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరనే దానిపై ప్రపంచమంత కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే బ్రిటన్ ప్రధాని రేస్ లో భారత్ సంతతికి చెందిన రిషి సునాక్, అటార్నీ జనరల్ సుయెల్లా బ్రవర్ మన్, హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బ్రిటన్ ప్రధాని పదవిని అధిష్టించే అవకాశం ఉంది. వీరిలో రిషి సునాక్ ముందు వరుసలో ఉన్నారు.

బ్రిటన్ ప్రధాని కావాలంటే కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. ఇప్పటికే రిషి సునాక్ 20 మంది ఎంపీల మద్దతు కూడగట్టుకొని.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈయన మొన్నటి వరకు జాన్సన్ బోరిస్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా కొనసాగారు. అయితే బోరిస్ పై ఉన్న కుంభకోణాల వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్న రిషి సునాక్ ముందుగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆ తరువాత వరుసపెట్టి మంత్రులు రాజీనామా చేయడంతో బోరిస్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఇక ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేస్ లో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారు ఉండడం నిజంగా హర్షించాల్సిన విషయం.

భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్ కొ ఫౌందర్ నారాయణ మూర్తి అల్లుడు. ఇక ప్రీతి పటేల్ విషయానికొస్తే.. గుజరాత్ కు చెందిన వారుగా తెలుస్తోంది. ఈమె యుకె లో పారిశ్రామికంగాను, రాజకీయంగా గాను ఫైర్ బ్రాండ్ గా పేరు గడించారు. ఇక సుయోల్లా బ్రేవర్ మాన్ 1960 వ శతకంలో యుకె కు వలస వచ్చిన భారత సంతతికి చెందిన వారు. ఈమె బ్రేగ్జిట్ అనుకూల టోరిలో కీలక నాయకురాలు. అయితే ఈమె మొదట్లో ప్రజలకు తెలియకపోయినప్పటికి అటార్నీ జనరల్ గా జెఫ్రీ కాక్స్ స్థానంలో ఎంపికైనప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఏది ఏమైనప్పటికి బ్రిటన్ లాంటి దేశంలో భారత సంతతికి చెందిన వారు ప్రధాని రేస్ లో ముందు వరుసలో ఉండడం నిజంగా హర్షించాల్సిన విషయం. మరి ఈ ముగ్గురిలో బ్రిటన్ ప్రధానిగా ఎవరు నిలుస్తారో చూడాలి.

Also Read

త్వరలో .. ప్లాస్టిక్ ను తినే రోబో చేపలు !

చైనా కాదు.. అగ్రస్థానంలో భారత్ ?

బుమ్రా దెబ్బ.. ఇంగ్లాండ్ అబ్బా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -